Viral Video: 300 అడుగుల లోయలో పడిన దూడ.. భారీ వర్షం.. ఎలా కాపాడారంటే..

గత మూడు రోజులుగా భారీ వర్షం కారణంగా లోయ మధ్యలో చిక్కుకుపోయిన దూడను మలంగ్‌గడ్ కొండకు చెందిన యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.

Viral Video: 300 అడుగుల లోయలో పడిన దూడ.. భారీ వర్షం.. ఎలా కాపాడారంటే..

Viral Video (2)

Viral Video: గత మూడు రోజులుగా భారీ వర్షం కారణంగా లోయ మధ్యలో చిక్కుకుపోయిన దూడను మలంగ్‌గడ్ కొండకు చెందిన యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. దూడ 300 అడుగుల లోతైన లోయ మధ్యలో చిక్కుకుపోయింది. సోమవారం ఉదయం థానే జిల్లాలోని అంబర్‌నాథ్ తాలూకాలోని లోయ మధ్యలో చిక్కుకుపోయిన దూడను గుర్తించిన గ్రామస్తులు రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా సాధ్యంకాలేదు. విషయాన్ని సమీపంలోని వాసర్ గ్రామానికి చెందిన యువకులు సూర్యాజీ పావ్షే, మినాంట్ పావ్షే, కదం సాల్వి, జయశ్రీ పవార్ తెలుసుకొని దూడను కాపాడేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

Viral Video: ఐడియా అదిరింది.. పెళ్లి వేడుక సజావుగా సాగింది.. వీడియో వైరల్

తాళ్ల సహాయంతో 300 అడుగుల లోయలో చిక్కుకుపోయిన దూడను పైకిలాగారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పొగమంచు కారణంగా దూడ ఎక్కడ చిక్కుకుపోయిందనేది సరిగా కనిపించలేదు. ఒక బండకు తాడును కట్టి దూడ చిక్కుకున్న ప్రదేశానికి వదిలాము. ఇద్దరు యువకులు కిందికి దిగి దూడకు తాళ్లను కట్టారు. నెమ్మదిగా పైకిలాగాం. అయితే అనూహ్య వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారిందని తెలిపాడు.

Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

దూడను రక్షించే క్రమంలో అది వారిపై దాడికి యత్నించింది. మూడు, నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవటంతో అది నీరసించిపోయి దాడికి యత్నించినట్లు వారు తెలిపారు. దానిని సురక్షితంగా పైకి లాగాక యువకులు దానికి మేతను అందించారు. మలంగ్ గడ్ ప్రాంతం యువకులు దూడను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు వీడియోను చూసి యువకులను అభినందిస్తూ కామెంట్లు చేశారు.