Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

ఇటలీకి చెందిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రేకో అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటలీలో ‘ఎండ్రాంగెటో’ అనే మాఫియా సంస్థను నడిపించాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. ‘ఎండ్రాంగెటో’.. ఇటలీలోనే అత్యంత భయంకరమైన మాఫియా గ్రూప్.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

Edgardo Greco: మాఫియా డాన్లు నేరాలు చేసి, పోలీసులు, ప్రత్యర్థుల నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రాంతంలో సాధారణ వ్యక్తుల్లా బతకడం సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. ఇటలీకి చెందిన ఒక మాఫియా డాన్, హంతకుడు ఫ్రాన్స్‌లో పిజ్జాలు తయారు చేస్తూ బతుకుతున్నాడు.

FIR On Nara Lokesh : నారా లోకేశ్ సహా సీనియర్ నేతలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు

16 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా ఉన్నాడు. ప్రస్తుతం పిజ్జా చెఫ్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే, చివరకు పోలీసులకు చిక్కాడు. ఇటలీకి చెందిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రేకో అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటలీలో ‘ఎండ్రాంగెటో’ అనే మాఫియా సంస్థను నడిపించాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. ‘ఎండ్రాంగెటో’.. ఇటలీలోనే అత్యంత భయంకరమైన మాఫియా గ్రూప్. దశాబ్దాల క్రితం నుంచి ఈ గ్రూప్ ఇటలీలో పలు హత్యలు, దారుణాలకు పాల్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాంగ్ కొకైన్ వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసేది. ఇప్పటికీ ఈ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల పలువురు సభ్యుల్ని ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు.

Unstoppble : వరుసగా పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్న ఆహా.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రొమో ఎప్పుడో తెలుసా??

యూరప్ వ్యాప్తంగా సంస్థకు చెందిన అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం ఈ గ్రూప్‌నకు చెందిన మరో మాఫియా లీడర్ మాట్టెయో మెస్సినా డెనారోను ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఎడ్గార్డో గ్రెకో విషయం బయటపడింది. అతడు ఫ్రాన్స్‌లోని కేఫ్ రొస్సిని రెస్టారెంట్‌లో పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇంటర్‌పోల్ పోలీసులు అతడిని తాజాగా అరెస్టు చేశారు. ప్రస్తుతం 63 ఏళ్ల వయసున్న ఎడ్గార్డోను అరెస్టు చేసేందుకు పోలీసులు 16 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అతడు 1990 ప్రారంభంలోనే ఇటలీలో అనేక హత్యలకు పాల్పడ్డాడు. కొన్నేళ్లక్రితం ఇనుప రాడ్లతో ఇద్దరు వ్యక్తుల్ని చంపాడు.

వారి మృతదేహాల్ని ఎవరికీ దొరక్కుండా యాసిడ్‌లో పడేశాడు. అప్పట్నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న ఎడ్గార్ పోలీసులకు చిక్కాడు. అతడు మూడేళ్లుగా అక్కడ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.