FIR On Nara Lokesh : నారా లోకేశ్ సహా సీనియర్ నేతలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. బంగారుపాళ్యం ఘటనలో నారా లోకేశ్ సహా పలువురు సీనియర్ నేతలపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

FIR On Nara Lokesh : నారా లోకేశ్ సహా సీనియర్ నేతలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు

Nara Lokesh

FIR On Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. బంగారుపాళ్యం ఘటనలో నారా లోకేశ్ సహా పలువురు సీనియర్ నేతలపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ సహా మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 290, 188, 341 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని, తమ విధులకు ఆటంకం కల్గించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

నిన్న బంగారపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.బహిరంగ సభ జరుగకుండా పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. దీంతో పక్కనే ఉన్న డాబా ఎక్కి లోకేశ్ ప్రజలతో మాట్లాడారు. పోలీసులు తీరును తప్పుబడుతూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు యువగళం వాహనాన్ని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది.

Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్

ఇక బంగారుపాళ్యం ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీతో కుమ్మక్కై లోకేశ్ అడ్డుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. డీఎస్ పీ సుధాకర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లు, టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి బెదిరింపులకు దిగారని లేఖలో ప్రస్తావించారు.

అధికార పార్టీతో కుమ్మక్కైన అత్యత్సూహం ప్రదర్శస్తున్న పోలీసులపై చర్యలు తేసుకోవాలని డీజీపీకి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. సీజ్ చేసిన మూడు వాహనాలను రిలీజ్ చేయాలని కోరారు. యువగళం పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించేలా స్థానిక పోలీసు అధికారులను ఆదేశించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.