NASA Artemis-1 Mission: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఆర్టెమిస్ అంటే ఏమిటి? ఆ పేరెందుకు పెట్టారంటే?

2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. దీనికి ఆర్టెమిస్ అనే పేరును పెట్టారు. ఆరు వారాల పాటు ఈ యాత్ర సాగుతోంది. ప్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్ఎల్ఎస్ నింగిలోకి దూసుకెళ్తోంది.

NASA Artemis-1 Mission: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఆర్టెమిస్ అంటే ఏమిటి? ఆ పేరెందుకు పెట్టారంటే?

nasa Artemis

NASA Artemis-1 Mission:  2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేటి సాయంత్రం 6.03 (భారత కాలమానం ప్రకారం)గంటలకు పంపించనుంది. అమెరికా అంతరిక్ష సంస్థ – నాసా ఈ మానవరహిత ప్రయోగానికి అర్టెమిస్-1 అని పేరు పెట్టింది. ఆర్టెమిస్ -1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతోంది. ప్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్ ఎల్ఎస్ నింగిలోకి దూసెళ్లోంది. 3.86 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న జాబిల్లిపైకి చేరుకోవాలంటే ఒరాయన్ కు దాదాపు వారం పడుతుంది. ఎస్ఎల్ఎస్ నింగిలోకి దూసుకెళ్లిన తరువాత నిర్ధేశిత సమయం తర్వాత రాకెట్ తో ఒరాయన్ విడిపోతుంది. జాబిల్లి దిశగా సాగే ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ పథకంలోకి వెళ్తుంది.

NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా

ఇదిలాఉంటే 1960లో చంద్రమామపైకి మానవసహిత యాత్రలు నిర్వహించటానికి అమెరికా ‘అపోలో’ ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్ పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అమెరికా వీటిని నిర్వహించింది. చందమామపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి జాబిల్లిపై గడపలేదు. తాజాగా ప్రయోగం ద్వారా 50ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపే కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. అయితే గతంలోలా కాకుండా ఈసారి చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాలు వేసేందుకు నాసా ఆర్టెమిస్ -1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ఈ ప్రయోగానికి ఆర్టెమిస్ అనే పేరును నాసా పెట్టింది. ఆర్టెమిస్ అంటే గ్రీక్ పురాణాల ప్రకారం ఒక దేవత. జ్యూస్ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 9,300 కోట్ల డాలర్లు నాసా ఖర్చు చేస్తోంది. ఆర్టెమిస్ -1 ఖర్చు 400 కోట్ల డాలర్లు కాగా, 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్-1 ప్రయాణించే దూరం 13లక్షల కిలో మీటర్లు ఉంటుందని నాసా తెలిపింది.