NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో అద్భుతమైన ఫొటోలను తరచుగా షేర్ చేస్తుంది. తాజాగా నాసా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలో ఖగోళం మొత్తం ఇంద్రధనస్సు రంగులను చూపిస్తుంది.

NASA: ప్లూటో యొక్క అద్భుతమైన రెయిన్‌బో ఇమేజ్‌ను షేర్ చేసిన నాసా

Nasa (1)

NASA: అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో అద్భుతమైన ఫొటోలను తరచుగా షేర్ చేస్తుంది. తాజాగా నాసా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలో ఖగోళం మొత్తం ఇంద్రధనస్సు రంగులను చూపిస్తుంది. గుండ్రని గ్రహం లాంటిది ప్లూటో. ఇది మన సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచున ఉంది. NASA ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఫోటో ప్లూటో యొక్క వివిధ విభాగాలను ఇంద్రధనస్సు వంటి రంగులలో అద్భుతంగా కనిపిస్తుంది.

NASA: విశ్వ‌రూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు

ఈ ఫొటోలో.. ఫ్లూటో గ్రహం యొక్క విభిన్న ప్రాంతాల మధ్య అనేక సూక్ష్మమైన రంగుల వ్యత్యాసాలను హైలైట్ చేయడానికి న్యూ హారిజన్స్ శాస్త్రవేత్తలు రూపొందించారని నాసా పోస్ట్‌లో పేర్కొంది. యూరోపాలోని గంభీరమైన పర్వతాలను తలపించేలా, సంక్లిష్టమైన, వైవిధ్యమైన ఉపరితలం, చెక్కిన కొండలు, మృదువైన మంచుతో నిండిన మైదానాలు, భారీగా గుంతలతో కూడిన భూభాగం, గాలికి ఎగిసిపడే దిబ్బలను తలపించేలా ఉన్నట్లు నాసా పేర్కొంది.

NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..

అయితే నాసా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఒక్కరోజులోనే 7.8 లక్షల లైక్‌లు వచ్చాయి. ప్లూటో అందం, స్పేస్ ఏజెన్సీ వర్తించే కలర్ కాంబినేషన్‌ని వినియోగదారులు మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. ‘ఓహ్ మై గాడ్’.. ఇది చాలా అందంగా ఉంది అని ఓ నెటిజన్ రాశారు. మరొకరు.. “ప్లూటో బయటకు వచ్చినట్లుగా ఉంది అంటూ పేర్కొన్నారు.