NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..

మన సౌర కుటుంబంలో గ్రహాంతర వాసుల గురించి అనేక శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతోంది. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా..? ఉంటే వారు మనుషులతో మాట్లాడతారా..? అనే సందేహాలు అందరిలో...

NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..

Nasa

NASA: మన సౌర కుటుంబంలో గ్రహాంతర వాసుల గురించి అనేక శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతోంది. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా..? ఉంటే వారు మనుషులతో మాట్లాడతారా..? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. సందేహాలను నివృత్తి చేసేలా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నాసా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగానికి తెరలేపారు. ఏలియన్స్ ను ఆకర్షించేలా పురుష, మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. బికాన్ ఇన్ ది గెలాక్సీ అనే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ప్రయత్నాన్ని నాసా చేపట్టనుంది.

NASA : అది ఏలియన్ పాదముద్రేనా? ఆసక్తికర ఫొటో విడుదల చేసిన నాసా..

పూర్తి నగ్నంగా, చేతులు పైకెత్తి హలో చెబుతున్న బంగిమలో ఉన్న స్త్రీ, పురుషు ఫొటోలను పంపుతున్నారు. దీనికితోడు గురుత్వాకర్షణ, డీఎన్ఏ నమూనాల చిత్రాలను కూడా చేర్చారు. కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జోనాథన్ జియాంగ్, అతని సహచరులు ఏలియన్స్ తో మాట్లాడేలా ఈ కమ్యూనికేషన్ ను రూపొందించారు. మానవుల నగ్న చిత్రాలు, డీఎన్ఏ నిర్మాణం ఎడమవైపున ఉండే వస్తు మార్గంతో పాటు ఫొటో దిశగా ఎవరినైనా సహాయం చేస్తుందని చెప్పారు.

NASA 5000 Exoplanets : మన సౌర‌వ్య‌వ‌స్థ‌ అవతల 5వేల గ్ర‌హాలు.. నాసా 3D వీడియో చూడండి..!

ప్రతిపాదిత సందేశంలో సార్వత్రిక కమ్యూనికేషన్ సాధనాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమిక గణిత, భౌతిక భావనలను వినయోగించారు. ఆ తరవాత భూమిపై జీవుల జీవరసాయన కూర్పుపై సమాచారం.. పాలపుంతలోని నక్షత్రాల సమూహం, సౌర వ్యవస్థ, భూమి ఉపరితలం వర్ణనలు డిజిటలైజ్ చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. BITG కోడ్ బైనరీ ట్రాన్స్‌మిషన్‌పై ఆధారపడి ఉంటుందని ఇది అన్ని గ్రహాంతర జీవులకు అర్థం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.