NASA : అది ఏలియన్ పాదముద్రేనా? ఆసక్తికర ఫొటో విడుదల చేసిన నాసా..

అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మార్స్ క్రేటర్ యొక్క అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో నెటిజన్లను ...

NASA : అది ఏలియన్ పాదముద్రేనా? ఆసక్తికర ఫొటో విడుదల చేసిన నాసా..

Nasa

NASA : అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మార్స్ క్రేటర్ యొక్క అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దటి ఆకారంలో కలిగిన పాదముద్ర ఫొటోలో కనిపిస్తుంది. అయితే “మార్టిన్ క్రేటర్ స్పాట్‌ను సూచిస్తుందని స్పేస్ ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్ చిత్రం యొక్క శీర్షికలో రాసింది. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్‌లో హై-రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ ఉపయోగించి చిత్రాన్ని తీసింది.

Nasa Instagram

Nasa Instagram

నాసా ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజర్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మార్స్‌పై ఏలియన్ పాదముద్ర కనిపిస్తోందని ఒక నెటిజర్ రీ ట్వీట్ చేయగా, దేవుని సృష్టియంతా ఆవరించి ఉంటుంది.. విశ్వం మినహాయింపు కాదంటూ మరొక నెటిజర్ రీ ట్వీట్ చేశాడు. మ్యాప్ ఇక్కడ పిక్సెల్‌కు 50 సెంటీమీటర్ల (19.7 అంగుళాలు) స్కేల్‌లో అంచనా వేయబడిందని నాసా క్యాప్షన్‌లో రాసింది.

NASA 5000 Exoplanets : మన సౌర‌వ్య‌వ‌స్థ‌ అవతల 5వేల గ్ర‌హాలు.. నాసా 3D వీడియో చూడండి..!

ఇదిలాఉంటే నాసా విడుదల చేసిన ఈ ఫొటోపై ఒకపక్క చర్చ కొనసాగుతుండగానే ఏలియన్స్ ఉనికిపై అమెరికా వరుసగా ప్రకటనలకు దిగుతోంది. 2014లో భూమిని ఢీకొట్ చేసిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్ గా యూఎస్ స్పేస్ కమాండ్ దృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్ సైతం ప్రకటన చేయడం ఉత్కంఠరేపుతోంది. దీంతో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఫొటోని పాదముద్రలా కనిపించే గుర్తు నిజంగానే ఏలియన్స్‌కు సంబంధించినదా? కాదా అనే విషయంపై నాసా క్లారిటి ఇవ్వలేదు.