NASA 5000 Exoplanets : మన సౌర‌వ్య‌వ‌స్థ‌ అవతల 5వేల గ్ర‌హాలు.. నాసా 3D వీడియో చూడండి..!

NASA 5000 Exoplanets : మన విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు అంతుపట్టడం లేదు. ఖగోళ రహస్యాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం అనేక పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

NASA 5000 Exoplanets : మన సౌర‌వ్య‌వ‌స్థ‌ అవతల 5వేల గ్ర‌హాలు.. నాసా 3D వీడియో చూడండి..!

This Is How 5,000 Planets Discovered Beyond Our Solar System Sound Listen And Watch In 3d

Updated On : March 22, 2022 / 8:06 PM IST

NASA 5000 Exoplanets : మన విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు అంతుపట్టడం లేదు. ఖగోళ రహస్యాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం అనేక పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే విశ్వంలో అనేక విషయాలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. అయితే మనకు తెలియని మరిన్ని గ్రహాలు మరెన్నో విశ్వంలో దాగి ఉన్నాయి. సౌర వ్యవస్థలో మనకు తెలిసిన గ్రహాల కన్నా వేలాది గ్రహాలు విశ్వంలో ఉన్నాయని నాసా సైంటిస్టులు గుర్తించారు. నాసా పరిశోధనల్లో మన సౌర వ్యవస్థ అవతల దాగిన 5000 గ్రహాలను కనుగొంది.

గత మూడు దశాబ్దాల్లో కనుగొన్న మొత్తం గ్రహాల సంఖ్యను 5000కు పైగా ఉన్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ గుర్తించింది. మన సౌర వ్యవస్థను దాటి 65 కొత్త గ్రహాలను నాసా కనుగొంది. ఈ 5000 గ్రహాలలో భూమి వంటి చిన్న రాతి ప్రపంచాలు, బృహస్పతి కంటే చాలా రెట్లు పెద్ద గ్యాస్ జెయింట్‌లు, ఆయా నక్షత్రాల చుట్టూ కక్ష్యలో వేడి బృహస్పతి వంటి గ్రహాలు ఉన్నాయని నాసా తెలిపింది. వీటినే సూపర్-ఎర్త్స్ అని పిలుస్తారు. మన సౌర వ్యవస్థకు పెద్ద రాతి ప్రపంచాలు, నెప్ట్యూన్ చిన్న వెర్షన్లు మినీ-నెప్ట్యూన్స్ కూడా ఉన్నాయని నాసా గుర్తించింది.

This Is How 5,000 Planets Discovered Beyond Our Solar System Sound Listen And Watch In 3d(1)

This Is How 5,000 Planets Discovered Beyond Our Solar System Sound Listen And Watch In 3d

అంతరిక్ష సంస్థ ఈ గ్రహాలకు సంబంధించి 3D విజువలైజేషన్‌ను చేసి రిలీజ్ చేసింది. అంతరిక్షంలో అద్భుతానికి సంబంధించి వీడియోను విడుదల చేసింది. మీరు ఈ గ్రహాలు చేసే శబ్దాన్ని కూడా వినవచ్చు. 360-డిగ్రీయానిమేషన్, సోనిఫికేషన్‌ వీడియోలో చూపించింది. మీరు ఈ శబ్దాలను 3D వీడియోలో వినొచ్చు. ఇంజనీర్లు డేటాను సౌండ్‌లుగా మార్చారు. నోట్స్ ద్వారా అందించిన అదనపు సమాచారంతో డిస్కవరీ వేగాన్ని వినవచ్చు. జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ద్వారా శబ్దాలు బయటకు వస్తున్నాయి. ఆకాశంలో భూమికి సమీపంలో ఉన్న వస్తువులను ఇది ట్రాక్ చేయగలదు. ఏదైనా ఒక గ్రహం కనిపించగానే ఆకాశంలో దాని స్థానంలో ఒక వృత్తం కనిపిస్తుంది.

వృత్తం పరిమాణం గ్రహం కక్ష్య సాపేక్ష పరిమాణాన్ని సూచిస్తుంది. అంతేకాదు.. రంగుతోపాటు ఏ గ్రహమో మూలాన్ని గుర్తించగలదు. కొత్తగా కనిపెట్టిన ఈ గ్రహాలకు ఒక నోట్ ప్లే చేయడం ద్వారా సంగీతాన్ని రూపొందించినట్లు నాసా తెలిపింది. నోట్ పిచ్ గ్రహం సాపేక్ష కక్ష్య కాలాన్ని సూచిస్తుంది. తమ నక్షత్రాల చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టే గ్రహాలు తక్కువ నోట్స్‌గా వినబడతాయి. అలాగే వేగంగా కక్ష్యలో తిరిగే గ్రహాలు ఎక్కువ నోట్స్‌గా వినబడతాయి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ఆ గ్రహాల్లో ప్రతి ఒక్కటి ఒక కొత్త ప్రపంచమని, అదో సరికొత్త గ్రహమని నాసా అంటోంది. ప్రతి ఏడాదిలో ఎన్ని కొత్త గ్రహాలు కనిపించాయో ఆ సంవత్సరాన్ని వీడియోలో చూపించింది. 2006 నుంచి 2022 వరకు ఇలా 5వేల కొత్త గ్రహాలను కనుగొన్నట్టు 3D వీడియోలో చూపించింది.

Read Also : Russian Troops Killed : రష్యాకు బిగ్‌లాస్ .. 15,300 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ వెల్లడి