Skydiving Wedding: ఇది నిజంగా వెరైటీనే..! ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లిచేసుకున్న నూతన జంట.. వీడియో వైరల్

వివాహం అనేది ప్రతీఒక్కరి జీవితంలో జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. ఇటీవల వివాహ వేడుకను కొందరు సాంప్రదాయ సెట్టింగులకు దూరంగా వెరైటీగా జరుపుకుంటున్నారు.

Skydiving Wedding: ఇది నిజంగా వెరైటీనే..! ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లిచేసుకున్న నూతన జంట.. వీడియో వైరల్

marriage

Skydiving Wedding: ప్రతీ యువతీ, యువకుడి జీవితాల్లో వివాహం అనేది మరిచిపోలేని వేడుక. ఆరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావిస్తుంటారు. దీంతో వివాహ వేడుకను వెరైటీగా జరుపుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. భారతదేశంలో అయితే.. వధువరుడు అందమైన వస్త్రదారణతో అందరి దృష్టిని ఆకర్షించేలా వివాహ వేడుకలను జరుపుకుంటారు. కొందరు వినూత్నంగా ఆలోచించి వివాహం చేసుకోవటం ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. విదేశాల్లో అయితే, నూతన జంట సోహసోపేతమైన పద్దతుల్లోనూ తమ వివాహ వేడుకను జరుపుకుంటుండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ నూతన జంట తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు ఎత్తైన కొండలపై నుంచి స్కైడైవింగ్ చేస్తూ వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. ..

వివాహం అనేది ప్రతీఒక్కరి జీవితంలో జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. ఇటీవల వివాహ వేడుకను కొందరు సాంప్రదాయ సెట్టింగులకు దూరంగా వెరైటీగా జరుపుకుంటున్నారు. ఈకోవలోనే ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను సాహసోపేతమైన వేడుకగా మార్చుకోవాలని భావించారు. దీంతో వారు ఎత్తైన కొండలపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి చేసుకున్నారు. అత్యంత భకరమైన కొండలపై నుంచి స్కైడైవింగ్ ద్వారా నూతన జంట పెళ్లిచేసుకుంటున్న క్రమంలో వివాహానికి హాజరైన వారు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.

Viral Video : సెలూన్‌కి వచ్చిన కస్టమర్‌ని చితకబాదిన బార్బర్.. వైరల్ వీడియోపై ప్రజలు ఆగ్రహం

ఈ వీడియోను లలిబ్రేటమోరద అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘మనం చేసే అల్లరి మనమే. మనల్ని పట్టుకునే చేతులు. అక్కడ మనకు గుర్తొచ్చే ఫ్లైట్ డేరింగ్ తర్వాత జీవితం. ప్రిస్సిల్లా, ఫిలిప్పోల వివాహం’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అయ్య బాబోయ్.. నేను ఖచ్చితంగా దీన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఖచ్చితంగా నా పెళ్లిరోజున ఇలా చేయాలనుకుంటున్నాను.. కానీ నేను చాలా భయపడుతున్నాను.. నూతన వధూవరులు అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వారికి అభినందనలు’ అని పేర్కొన్నాడు. మరో నెటిజన్ ఈ వీడియోను చూసి ఇదేం పెళ్లిరా బాబు.. ఇంత భయకరంగా ఉంటుందా? అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. నేను ఈ వీడియోను చూడగానే భయపడ్డాను. ఇలా చేయడం ప్రమాదకరం అంటూ పేర్కొన్నాడు. ఇలా పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.