Dementia : పుతిన్‌‌కు పార్కిన్సన్ వ్యాధి.. బ్రిటన్ మీడియా ఆరోపణలు

క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్‌తో మెదడు రుగ్మతతో బాధపడుతున్నారని యూకే మీడియా తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా పుతిన్...

Dementia : పుతిన్‌‌కు పార్కిన్సన్ వ్యాధి.. బ్రిటన్ మీడియా ఆరోపణలు

Putin (1)

President Putin suffers from dementia, : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యంపై బ్రిటన్ మీడియా చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. 70 ఏళ్ల పుతిన్.. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని బ్రిటన్ మీడియా ఆరోపిస్తోంది. ఇప్పటికే పుతిన్‌లో పార్కిన్సన్‌ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పింది. పుతిన్ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందని… సన్నిహితులు, అతిథులతో కూడా చాలా దూరం పాటిస్తున్నారని వెల్లడించింది. పుతిన్.. నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉంటారు.

Read More : Russia Putin : యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేది లేదంటున్న పుతిన్‌

ఇప్పటికీ ఆయనకు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. అయితే క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్‌తో మెదడు రుగ్మతతో బాధపడుతున్నారని యూకే మీడియా తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా పుతిన్ తీసుకునే నిర్ణయాల ద్వారా ఈ విషయం అర్థమవుతుందని స్పష్టం చేసింది. అలాగే మార్చి మొదటి వారంలో యూకే విదేశాంగ కార్యదర్శి లార్డ్ డేవిడ్ ఓవెన్ పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ స్టెరాయిడ్లను తీసుకుంటారని… ఇది ఆయన దూకుడును పెంచుతుందని ఆరోపించారు. అయితే ఆయనకు అనారోగ్య కారణంగా స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్నారేమో తెలియదు కానీ… పుతిన్ రోగనిరోధక శక్తి నశించిపోయిందన్నారు. గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై చాలా వార్తలు, ఊహగానాలు ప్రసారం అయ్యారు. మరి బ్రిటన్ మీడియా కథనాల్ని పుతిన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More : Russia : యుక్రెయిన్‌ పై యుద్ధం.. వ్యూహం మార్చిన రష్యా

మరోవైపు…యుక్రెయిన్ పై రష్యా యుద్దం, దాని వల్ల నెలకొన్న పరిణామాలకు సంబంధించి భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు మరింత భీకరగా మారిన క్రమంలో భారత్ అక్కడి రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీకాగా, ఆ సమావేశం కొనసాగుతుండగానే విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.