Russia Putin : యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేది లేదంటున్న పుతిన్‌

తమ బలగాలకు కొన్ని ప్రాంతాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న యుక్రెయిన్‌ ఆర్మీని కట్టడి చేయడంపై రష్యా దృష్టి సారించింది.

Russia Putin : యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేది లేదంటున్న పుతిన్‌

Putin

Russia’s President Putin : తాము అనుకున్నది అనుకున్నట్టు జరిగే వరకు తగ్గేదేలే అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. చర్చలైనా.. యుద్ధమైనా.. తాము అనుకున్నది జరగాల్సిందే అని ఇప్పటికే ప్రకటించిన పుతిన్‌.. అదే బాటలో నడుస్తున్నారు. యుక్రెయిన్‌పై యుద్ధానికి ఇప్పట్లో ముగింపు పలికేది లేదంటున్నారు పుతిన్‌. రష్యా బలగాల కదలికలు.. మారుస్తున్న వ్యూహాలు.. యుక్రెయిన్‌ నగరాలపై పెరుగుతున్న దాడులను చూస్తుంటే ఇది క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.

మరోవైపు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాతో యుద్ధంపై భిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఓ వైపు రష్యాకు తలొగ్గేది లేదు.. తమ సత్తా ఏంటో చూపిస్తాం.. రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదంటూనే.. మరోవైపు పుతిన్‌ను చర్చలకు ఒప్పించండి ప్లీజ్‌ అంటూ మధ్యవర్తులను వేడుకుంటున్నారు జెలెన్‌స్కీ. పుతిన్‌తో స్వయంగా తానే మాట్లాడుతానని.. దానికి ఇజ్రాయిల్ వేదికగా ఉండాలని కోరారు జెలెన్‌స్కీ. పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించే బాధ్యతను ఇజ్రాయిల్‌ తీసుకోవాలని కోరారు.

Russia : యుక్రెయిన్‌ పై యుద్ధం.. వ్యూహం మార్చిన రష్యా

అయితే యుక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన మూడు విడతల చర్చల్లో ఒకటి కూడా సఫలమవ్వలేదు. తమ డిమాండ్ల విషయంలో అటు రష్యా, ఇటు యుక్రెయిన్‌ వెనక్కి తగ్గకపోవడంతో అడుగులు ముందుకు పడటం లేదు. గతంలో కూడా బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలో కూడా ఇలానే ప్రవర్తించారు జెలెన్‌స్కీ. నాటోలో చేరే ఆసక్తి లేదని.. రష్యాతో రాజీకి వస్తామని ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జెలెన్‌స్కీ.. ఆ తర్వాత బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ నాటో తమకు మరింత సాయం చేయాలని.. మీరే మాకు దిక్కు అన్నట్టుగా మాట్లాడారు.

తమ బలగాలకు కొన్ని ప్రాంతాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న యుక్రెయిన్‌ ఆర్మీని కట్టడి చేయడంపై రష్యా దృష్టి సారించింది. నాటో నుంచి యుక్రెయిన్‌కు అందుతున్న ఆయుధ సాయాన్ని అడ్డుకునేందుకు పావులు కదుపుతోంది. నాటో నుంచి ఆయుధాలతో వస్తున్న కాన్వాయ్‌పై దాడులు చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చింది. తమ కళ్ల ముందే శత్రువుకు ఆయుధాలు అందిస్తుంటే చూస్తూ ఉరుకునేది లేదంది రష్యా. తమ మిసైళ్లకు ఈ ఆయుధాల కాన్వాయ్‌లు టార్గెట్‌ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఆ పనిని మానుకోండని హెచ్చరిస్తోంది రష్యా.

Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

మరోవైపు రష్యా కోరి కొరివితో తలగోక్కుంటోందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రష్యా నెక్ట్స్‌ టార్గెట్‌ నాటో దేశాలే అన్న వార్తలపై స్పందించిన బైడెన్‌… తమతో పెట్టుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధమే అని అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. నాటో దేశాల భూభాగాన్ని కాపాడుకునేందుకు దేనికైనా రెడీ అన్నారు. వేలాది మంది సైనికులతో సహా.. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు రష్యా సరిహద్దుల్లోని నాటో దేశాలకు చేరుకుంటున్నాయని.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు బైడెన్‌. ఇప్పటికే ఆ దేశాల్లో అమెరికా బలగాల కదలికలు మొదలయ్యాయి.

మొత్తానికి నాటో గుట్టు చప్పుడు కాకుండా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ యుద్ధంలో నిలిచేలా చేస్తుంటే.. రష్యా మాత్రం యుక్రెయిన్‌ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ యుద్ధం ఆగాలంటే రష్యా లక్ష్యమైనా నెరవేరాలి.. పుతిన్‌ మనసైనా మారాలి.. లేదా యుక్రెయిన్‌తో రష్యా రాజీకైనా రావాలి. ఇందులో ఏదీ జరిగినా యుక్రెయిన్‌ యుద్ధానికి రెడ్‌ సిగ్నల్‌ పడినట్టే. కానీ ఆలోపు ఇంకెన్ని నగరాలు శిథిలాలుగా.. సామాన్య ప్రజలు సమిధలుగా మారుతారో తెలియదు.