Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

అమెరికా స్వీయ నిధులతో ఉక్రెయిన్ లో ల్యాబులను నిర్వహిస్తోందని రష్యా తెలిపింది. రసాయన లేదా జీవాయుధాలను ప్రయోగించి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే కుట్ర చేస్తుందని అమెరికా ఆరోపించింది.

Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

War (2)

Biological and chemical weapons : యుక్రెయిన్​​-రష్యా యుద్ధంలో జీవ, రసాయన ఆయుధ అంశాలు తెరమీదికి వచ్చింది. ఉక్రెయిన్​లో అమెరికా జీవ ఆయుధ ల్యాబ్‌లు నడిపిస్తోందని రష్యా ఆరోపించింది. రష్యా ఆరోపణలను అమెరికా ఖండించింది. యుక్రెయిన్​పై రష్యా జీవ, రసాయన అస్త్రాలను ప్రయోగించే కుట్రలో భాగంగానే ఇలాంటి వాదనలను చేస్తున్నారని అమెరికా విమర్శించింది. ఉక్రెయిన్‌లో కనీసం 30 ల్యాబ్‌లు ఉన్నాయని, అక్కడ ప్రమాదకరమైన వ్యాధికారక సూక్ష్మజీవులతో ప్రయోగాలు జరుగుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఐరాస దృష్టికి రష్యా తీసుకువెళ్లింది.

అమెరికా స్వీయ నిధులతో ఉక్రెయిన్ లో ల్యాబులను నిర్వహిస్తోందని రష్యా తెలిపింది. యుక్రెయిన్​పై రసాయన లేదా జీవాయుధాలను ప్రయోగించి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే కుట్ర చేస్తుందని అమెరికా ఆరోపించింది. జీవ, రసాయన ఆయుధాల ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఆయా దేశాల సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ సూచించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం 18 రోజులకు చేరింది. రష్యా సైన్యం చేస్తున్న భీకర దాడులతో యుక్రెయిన్​ అల్లాడుతోంది.

Russian Mercenary Army : యుక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యం.. రంగంలోకి 16 వేల మంది వాలంటీర్లు

ఎటు చూసినా ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలు, వాణిజ్య పరమైన ఇబ్బందులు వచ్చినా.. రష్యా లెక్క చేయడం లేదు. యుక్రెయిన్​పై పట్టు కోసం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను ప్రధాన నగరాలపైకి సంధిస్తోంది. మృతదేహాలను పూడ్చిపెట్టడానికైనా విరామం ఇవ్వని రీతిలో రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300 మంది యుక్రెయిన్​ సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు​ జెలెన్​స్కీ తెలిపారు.

యుక్రెయిన్​పై సైనిక చర్యను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. కీవ్‌తోపాటు పలు నగరాల్లో ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర పోరాటం సాగుతోంది. మాస్కో పదాతిదళాలు కీవ్‌కు 15కిమీ సమీపానికి చేరుకున్నాయి. మరియుపోల్‌లో దాడులతో పౌరుల తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మెలిటొపోల్‌ నగర మేయర్‌ను రష్యా బలగాలు అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా యుద్ధం కొత్త దశలోకి మారింది. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు.

Russia Ukraine War: యుక్రెయిన్ పై పట్టు కోసం రష్యన్ ఆర్మీ కొత్త ఎత్తులు

యుద్ధాన్ని తక్షణం విరమించాలని నేతలు పుతిన్ ను కోరారు. పుతిన్‌తో జెరూసలెంలో సమావేశమయ్యేందుకు జెలెన్‌స్కీ ప్రతిపాదన చేశారు. మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెన్నెట్‌ను జెలెన్ స్కీ కోరారు. రష్యా సైనిక చర్యలో ఉక్రెయిన్​లో 579 మంది పౌరులు మృతి, చెందగా, వెయ్యిమందికి పైగా గాయపడ్డారని ఐరాస మానవ హక్కుల హైకమిషన్ వెల్లడించింది. మృతుల్లో 42 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. అలాగే ఉక్రెయిన్ నుంచి 25 లక్షల మంది పౌరులు ఇతరప్రాంతాలకు వలస వెళ్లినట్లు పేర్కొంది.