Russian Mercenary Army : యుక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యం.. రంగంలోకి 16 వేల మంది వాలంటీర్లు

మిడిల్‌ ఈస్ట్ దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది.

Russian Mercenary Army : యుక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యం.. రంగంలోకి 16 వేల మంది వాలంటీర్లు

Army

Russian mercenary army : రండి.. యుక్రెయిన్‌ యుద్ధంలో తమతో కలిసి పోరాడండి.. అంటూ విదేశీయులకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిస్తున్నారు. యుక్రెయిన్‌ యుద్ధంలో వ్యూహాలు మార్చుతున్న పుతిన్‌.. రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు అర్బన్‌ వార్‌ ఫేర్‌లో ఎక్స్‌పర్ట్స్‌ అయిన సిరియన్‌ ఫైటర్లను కీవ్‌ నగర వీధుల్లో మోహరించేందుకు వీలుగా పుతిన్‌ ఈ పిలుపునిచ్చారు. యుక్రెయిన్‌పై పట్టుకు రష్యా ఇతర దేశాల నుంచి ఫైటర్లను మోహరిస్తోందని ఇప్పటికే అనేక దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు పుతిన్‌ స్టేట్‌మెంట్‌తో ఈ ఆరోపణలన్ని నిజమే అని ప్రూవ్ చేశారు.

మిడిల్‌ ఈస్ట్ దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. వీరంతా ఇష్టపూర్వకంగా రష్యాకు మద్దతుగా పోరాడేందుకు ముందుకు వచ్చారని.. గతంలో వీరంతా ఐసీస్‌పై పోరాటం చేసిన వారేనని తెలిపింది. అయితే వారంతా సిరియా ఫైటర్లే అని.. వారు కీవ్‌ వీధుల్లో రక్తపాతం సృష్టించేందుకు వస్తున్నారని ఇప్పటికే యుక్రెయిన్ ప్రకటించింది.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై పుతిన్ కొత్త వ్యూహం.. ఆయుధాలు ఇస్తామంటూ జనాలకు ఆఫర్..!

సిరియాపై జెండా పాతాలన్న అమెరికా కలను భగ్నం చేయడంలో సిరియా ఫైటర్లు కీలక పాత్ర పోషించారు. అమెరికా ఏళ్ల పాటు నిరంతరాయంగా యుద్ధం చేసినా.. వారి కల.. కలగానే మిగిలిపోవడంలో ఈ సిరియా ఫైటర్ల పాత్ర కీలకం. సిరియా నగర వీధుల్లోకి చొచ్చుకొచ్చిన అమెరికా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు సిరియా ఫైటర్లు. ఈ విషయాన్ని పసిగట్టిన రష్యా.. ఇప్పుడు వీరి సేవలను ఉపయోగించుకునేందుకు రెడీ అయ్యింది.

మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు చెందిన వాలంటీర్లు రష్యాకు వారి సహకారం అందించేందుకు రెడీగా ఉన్నారని పుతిన్‌ ప్రకటించినా.. ఒక్కో ఫైటర్‌కి ఆరు నెలల కాలానికి 200 నుంచి 300 డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెరికా ఇప్పటికే ఆరోపించింది. 2015 నుంచి సిరియా ప్రభుత్వానికి మద్దతుగా వార్‌జోన్‌లోకి రష్యా ఎంటరైంది. అప్పటి నుంచి సిరియా ఫైటర్లతో రష్యన్‌ ఆర్మీకి సంబంధాలు ఉన్నాయి.

Russia Forces : యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు

లిబియాలో కూడా అమెరికాకు కౌంటర్‌గా ఈ ఫైటర్లనే మోహరించింది రష్యా. ఇప్పుడు కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తోంది. సిరియా బలగాలు కూడా రష్యాకు మద్దతుగా పోరాడేందుకు రెడీ అవుతున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు యుక్రెయిన్‌కు మద్దతుగా కదనరంగంలో పోరాడటానికి జెలెన్‌స్కీ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ లీజియన్‌ ఏర్పాటు చేసింది. యుక్రెయిన్‌కు మద్ధతుగా పోరాడటానికి బ్రిటన్‌, అమెరికా మాజీ సైనికులు ఇప్పటికే తరలి వచ్చారు.