Russia Forces : యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు

ఎట్టకేలకు రష్యా బలగాలు(Russia Forces) యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతోనే ర‌ష్యా బ‌ల‌గాలు భీక‌రంగా కాల్పులు జ‌రుపుతూ..

Russia Forces : యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు

Russia Forces

Russia Forces : ఎట్టకేలకు రష్యా బలగాలు అనుకున్నది సాధించాయి. యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. భార‌త కాలమానం ప్ర‌కారం శుక్రవారం రాత్రి ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ఇచ్చాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతోనే ర‌ష్యా బ‌ల‌గాలు భీక‌రంగా కాల్పులు జ‌రుపుతూ ముందుకు సాగుతున్నట్టు తెలిపాయి.

యుక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను ఇప్ప‌టికే త‌న స్వాధీనంలోకి తీసుకున్న ర‌ష్యా బ‌ల‌గాలు.. వాటికంటే ముందుగానే కీవ్‌ను త‌మ వ‌శం చేసుకోవాల‌ని భావించాయి. అయితే యుక్రెయిన్ సేన‌ల‌తో పాటు ఆ దేశ సాధార‌ణ పౌరులు కూడా ర‌ష్యా బ‌ల‌గాల‌కు అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించి వారిని అడ్డుకున్నారు.(Russia Forces)

గ‌డిచిన కొన్ని రోజులుగా కీవ్ న‌గ‌రాన్ని న‌లుదిశ‌లా చుట్టేసిన ర‌ష్యా బ‌ల‌గాలు శుక్ర‌వారం సాయంత్రం కీవ్ న‌గ‌రంలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఈ క్ర‌మంలో మ‌రికొన్ని గంటల్లోనే కీవ్ న‌గ‌రాన్ని ర‌ష్యా సేన‌లు త‌మ స్వాధీనంలోకి తీసుకునే అవ‌కా‌శాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై పుతిన్ కొత్త వ్యూహం.. ఆయుధాలు ఇస్తామంటూ జనాలకు ఆఫర్..!

యుక్రెయిన్‌పై దాడి మొద‌లైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్యా 775 మిస్సైళ్ల‌ను ఫైర్ చేసిన‌ట్లు అమెరికా చెప్పింది. ఆ మిస్సైళ్ల‌లో అన్ని ర‌కాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ర‌ష్యా కొత్త త‌ర‌హా అటాక్ ప్రారంభించింది. యుక్రెయిన్‌లోని ప‌శ్చిమ ప్రాంతాల‌ను తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. దాడులు మొద‌లై 13 రోజులు గ‌డిచిన త‌ర్వాత తొలిసారి యుక్రెయిన్‌లోని ప‌శ్చిమ ప్రాంతాల‌పై బాంబుల వ‌ర్షం ప్రారంభించింది.

ప‌శ్చిమ ప్రాంతంలోని లుస్క్‌, ఇవానో-ఫ్రాంకివిస్క్ న‌గ‌రాల‌పై మిస్సైల్ దాడులు జ‌రిగాయి. వైమానిక కేంద్రాల‌ను మిస్సైళ్ల ద్వారా టార్గెట్ చేశారు. ఈ రెండు న‌గ‌రాల‌తో పాటు డిప్రో ప్రాంతంపై కూడా మిస్సైళ్ల దాడి జ‌రిగింది. యుద్ధం ప్రారంభించిన రెండు వారాల త‌ర్వాత తొలిసారి ఆ ప్రాంతాల్లో బాంబు దాడి జ‌రిగింది. ర‌ష్యా దాడులు ప్రారంభించిన త‌ర్వాత యుక్రెయిన్‌లోని ప‌శ్చిమ ప్రాంతాల‌కు కొంద‌రు వెళ్తున్నారు. అక్క‌డి ప్రాంతాలు సుర‌క్షితంగా ఉంటాయ‌న్న భావ‌నతో ప్ర‌జ‌లు అటు వ‌ల‌స వెళ్తున్నారు.

పశ్చిమ దేశాల ఆంక్షలను లెక్క చేయని రష్యా.. యుక్రెయిన్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. పలు నగరాలు రష్యా వశమయ్యాయి. రాజధాని కీవ్‌ స్వాధీనానికి రష్యా సైన్యం తెగ ప్రయత్నాలు చేసి చివరికి సఫలం అయ్యింది. కాగా, యుక్రెయిన్ సేనలు తీవ్రంగానే ప్రతిఘటించాయి. రష్యాపై తమదే పైచేయి అని ఉక్రెయిన్‌ తెలిపింది. రష్యా దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి 12వేల మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని యుక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 విమానాలు, 28 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ వ్యవస్థలు, 81 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

Russia – Ukraine War: యుక్రెయిన్‌పై వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్న రష్యా

యుక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుతిన్‌ దురాక్రమణదారు అని.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాకు అనుకూలమైన వాణిజ్య హోదాను రద్దు చేసుకుంటాయన్నారు. ఉక్రెయిన్‌లో రసాయన ఆయుధాల్ని ప్రయోగిస్తే రష్యా భారీ ముల్యం చెల్లించాల్సి ఉంటుందని బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు.