Russia Ukraine War : యుక్రెయిన్‌పై పుతిన్ కొత్త వ్యూహం.. ఆయుధాలు ఇస్తామంటూ జనాలకు ఆఫర్..!

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై పుతిన్ కొత్త వ్యూహం.. ఆయుధాలు ఇస్తామంటూ జనాలకు ఆఫర్..!

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా బలగాలు యుక్రెయిన్ ప్రధాన నగరాల్లో దూసుకెళ్తున్నాయి. యుక్రెయిన్ ఆర్మీ కూడా అదే దీటుగా రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటోంది. యుక్రెయిన్‌పై 16 రోజులుగా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. రష్యాకు దాడులను యుక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇన్ని రోజులు గడుస్తున్నా యుక్రెయిన్ రాజధాని కీవ్ రష్యాకు చిక్కలేదు. రష్యా సైన్యంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చాలా అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే పుతిన్ యుక్రెయిన్‌పై కొత్త వ్యూహానికి సిద్ధం చేస్తున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఆ దేశ ప్రజలను రెచ్చగొడుతున్నారు. యుద్ధం చేయడానికి రమ్మంటూ యుక్రెయిన్ జనాలకు పిలుపునిస్తున్నారు. పోరాటం చేసేందుకు వచ్చే జనాలకు ఆయుధాలు కూడా ఇస్తామంటూ పుతిన్ ఆఫర్ ఇచ్చారు. సైన్యంతో అసంతృప్తిగా ఉన్న పుతిన్.. తిరుగుబాటుదారులను సిరియా నుంచి రప్పించేందుకు భారీ స్కెచ్ వేశారు. ఎలాగైనా యుక్రెయిన్ ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పుతిన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తనకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Russia Ukraine War Russian President Vladimir Putin's Strategy In Ukraine (1)

Russia Ukraine War : Russian President Vladimir Putin’s Strategy In Ukraine

రష్యా దాడులతో యుక్రెయిన్ జనాభా చాలావరకూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వందలాది మంది యుక్రెయిన్ సైన్యం, పౌరులు ష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు విచక్షణరహితంగా యుక్రెయిన్ పై క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. ప్రధానంగా యుక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. యుక్రెయిన్ జనావాసాలపై కూడా బాంబులను విసురుతోంది. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరస్పరం నేరుగా చర్చలకు ప్రతిపాదనలు చేసుకున్నప్పటకీ రష్యా డిమాండ్లకు యుక్రెయిన్ తలగ్గొడం లేదు. పుతిన్ తన పంథాను మార్చుకోవడం లేదు.

Russia Ukraine War : డ్నిప్రోలో రష్యా వైమానిక దాడి.. ధ్వంసమైన ఇళ్లు!
యుక్రెయిన్ తో యుద్ధ సమయంలో అక్కడే చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు తాత్కాలిక విరామం ప్రకటించిన రష్యా… మళ్లీ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్ పై దాడులను రష్యా మరోసారి తీవ్రతరం చేసింది. యుక్రెయిన్ ప్రాంతమైన డ్నిప్రోకోలో రష్యా వైమానిక దాడులకు పాల్పడుతోంది. క్షిపణులతో యుక్రెయిన్ జనావాసాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే షూ ఫ్యాక్టిరీ, పలు అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయి. కీవ్ నగరంలోనూ రష్యా దాడులను తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇదివరకే కీవ్, ఖార్కివ్, సుమీ, మురియుపోల్ ప్రాంతాల్లో రష్యా బలగాలు తమ క్షిపణులతో విధ్వంసాన్ని సృష్టించారు. కీవ్ నగరంలోకి చొచ్చుకుని వచ్చిన రష్యా బలగాలు వివిధ ప్రాంతాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులకు తెగబడుతున్నాయి.

Read Also : Russia Ukraine war: రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఎంత నష్టం జరిగిందంటే!