Russia Ukraine war: రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఎంత నష్టం జరిగిందంటే!

రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ల నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి

Russia Ukraine war: రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఎంత నష్టం జరిగిందంటే!

Ukraine

Russia Ukraine war: యుద్ధం అంటేనే ఆర్ధిక భారం. దేశ ప్రగతికి అవరోధం. ఎన్నో పర్యవసానాలను అంచనా వేసుకుంటేగానీ యుద్ధానికి దిగరు. అటువంటిది, రష్యా ఉన్నట్టుండి యుక్రెయిన్ పై భీకర యుద్ధానికి దిగింది. ఎటువంటి లాభాపేక్షలేని యుద్ధంలో దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవడంతప్ప.. పెద్దగా ఒరిగేదేమి ఉండదు. ఒకసారి యుద్ధం ప్రారంభమైతే.. ఇరు దేశాల్లోనూ భారీ ఆస్థి ప్రాణ నష్టంతో పాటు, ఆర్ధిక నష్టం కూడా నమోదు అవుతుంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై పెను భారం పడనుంది. యుద్ధం వలన ఒక్క యుక్రెయిన్ లోనే 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఆదేశాధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇక ఆయుధాల సరఫరా, సైన్యం ఖర్చులు, బాంబుల తయారీ వంటి ఇతరత్రా ఖర్చులతో రష్యాపైనా పెద్ద ఎత్తున ఆర్ధిక భారం తప్పలేదు.

Also read: Russia China: రష్యాకు విమాన పరికరాలను నిలిపివేసిన చైనా: భారత్ కు కలిసొచ్చే అవకాశం

యుక్రెయిన్ నగరాల్లో రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.76.29లక్షల కోట్లు) యుద్ధ నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నష్టం నుంచి కోలుకునేందుకు యుక్రెయిన్ కు అర్ధ దశాబ్దకాలం పడుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముఖ్య ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో అన్నారు. “ప్రస్తుతం తమ దేశంలో నిర్వహించే వ్యాపారాలలో 50 శాతం పనిచేయడం లేదు, ఇంకా పనిచేస్తున్నవి 100 శాతంతో పనిచేయడం లేదు” దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థపై కోలుకోలేని భారం పడిందని ఒలేగ్ మీడియాకు వివరించారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా ఆర్థికాభివృద్ధి మాత్రం సాధ్యపడదని ఒలేగ్ తెలిపారు.

Also read: Ukraine Russia War: ఒట్టి చేతులతో భారీ బాంబును నిర్వీర్యం చేసిన యుక్రెయిన్ బాంబు స్క్వాడ్: వీడియో

మరోవైపు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యుక్రెయిన్ కు ప్రపంచ దేశాల ఆర్ధిక సహాయం కొనసాగుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) ఉక్రెయిన్ కోసం $1.4 బిలియన్ల అత్యవసర ఆర్ధిక సహాయాన్ని బుధవారం ఆమోదించింది. ప్రపంచ బ్యాంక్ సైతం $3 బిలియన్ల ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే $500 మిలియన్లను విడుదల చేసింది. అమెరికా సైతం ఉక్రెయిన్‌కు 14 బిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తూ బుధవారం అమెరికా చట్టసభ “కాంగ్రెస్” ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా పాశ్చాత్య ఆంక్షల ఫలితంగా స్తంభింపజేసిన రష్యన్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్‌ నీదులలో సుమారుగా $300 బిలియన్లను, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిత్రపక్షాలుగా ఉన్న ఒలిగార్చ్‌ల నుండి స్వాధీనం చేసుకున్న నిధులను కూడా యుక్రెయిన్ ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో ఆర్ధిక సహాయం కన్నా తమకు ఆయుధ సహాయం ఎంతో అవసరమని ఆదిశగా మిత్ర దేశాలు సహాయం అందించాలని ఒలేగ్ ఉస్టెంకో విజ్ఞప్తి చేశారు.

Also read: Russia Ukraine war: యుక్రెయిన్ కు అండగా బ్రిటన్.. మరిన్ని ఆయుధాలు సరఫరా