Distant red stars signals : 19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసులు ఇచ్చిన సంకేతాలా?

19 నక్షత్రాల నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్ పై సైంటిస్టులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సంకేతాలు గ్రహాంతరవాసులు ఇచ్చినవే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

10TV Telugu News

19 Distant red stars signals : ఏలియన్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మూడో ప్రపంచ యుద్ధం ఏలియన్స్ తోనే అనీ..అవి మన అణు క్షిపణుల్ని ట్యాంపరింగ్ చేయటమే కాకుండా పనిచేయకుండా చేస్తున్నాయని యూఎస్ ఆర్మీ అధికారి ఆఫీసర్‌ రాబర్ట్‌ సలాస్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారిన క్రమంలో తాజాగా సౌర వ్యవస్థ అవతలినుంచి కొన్ని సంకేతాలు వచ్చాయని..ఆ సంకేతాలు గ్రహాంతరవాసులే పంపించారనే వార్త మరో హాట్ టాపిక్ గా మారింది.అసలు గ్రహాంతరవాసుల ఉన్నాయా? లేవా? అనే టాపిక్ ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. కానీ అవి ఉన్నాయని కచ్చితమైన ఆధారాలేమీ లేవు. ఎక్కడ ఏదైనా వింత ఘటన జరిగినా అవి గ్రహాంతరవాసుల పనే అంటూ చర్చ జరగడం సర్వసాధారణమైపోయింది. వీటి ఉనికిపై ఎన్నో దశాబ్దాల నుంచి అన్ని దేశాల శాస్త్రవేత్తలూ పరిశోధనలు సాగిస్తున్నారు. అయినా వాటి గురించి ఆధారాలు లభ్యమవలేదు.

Read more : War with Aliens :మూడో ప్రపంచ యుద్ధం ఏలియన్స్ తోనేనా..?!అవే మన క్షిపణుల్ని పనిచేయకుండా చేస్తున్నాయా?

ఏలియన్స్‌ను చూశామని కొందరంటే..ఓ మహిళ మాత్రం ఏలియన్స్ నన్ను కిడ్నాప్ చేశాయని తెలిపింది. ఈక్రమంలో సౌర వ్యవస్థ అవతలి నుంచి రేడియో తరంగాలు వస్తున్నాయని వాటిని గుర్తించామని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ సంకేతాలు గ్రహాంతరవాసుల పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంతరిక్షం నుంచి చాలా సార్లు గుర్తు తెలియని సిగ్నల్స్‌ వచ్చాయి. వాటిని ఏలియన్సే పంపి ఉంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న సిగ్నల్స్ మాత్రం..గతంలో వచ్చినవాటికంటే డిఫరెంట్ గా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతరిక్షం నుంచి కొత్త సంకేతాలు అందుతుండడంతో ఏలియన్స్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. మన సౌర వ్యవస్థకు అవతల నుంచి వస్తున్న రేడియో సంకేతాలను తొలిసారిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదూర నక్షత్రాల నుంచి వస్తున్న అసాధారణ సంకేతాలను రేడియో యాంటెనా ‘ద డచ్‌ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్‌) సాయంతో గుర్తించారు. 19 అరుణ మరుగుజ్జు నక్షత్రాల నుంచి సిగ్నల్స్ గుర్తించామని చెబుతున్నారు. అయితే వీటిలో నాలుగు నక్షత్రాల చుట్టూ ఇతర గ్రహాలు ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. వాటిపై ఏలియన్స్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more : viral pic : బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ప్రాణి..ఇదేంటబ్బా అంటూ జనాలు ఆసక్తి

సౌరకుటుంబంలోని గ్రహాల నుంచి శక్తివంతమైన రేడియో తరంగాలు వస్తుంటాయని..కానీ ఇప్పుడు వస్తున్న తరంగాలు.. చాలా ప్రత్యేకంగా ఉన్నాయంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి తరంగా అందలేదని..మరుగుజ్జు నక్షత్రాల్లో తీవ్రస్థాయిలో అయస్కాంత చర్యలు ఉంటాయని..ఫలితంగా రేడియో తరంగాలు వెలువడుతుంటాయని తెలిపారు. ఇప్పుడు వస్తున్న తరంగాలు అలాంటివే అని చెబుతున్నారు సైంటిస్టులు. దీనిపై లోతైన విశ్లేషణ చేస్తే మరింత ఖచ్చిత సమాచారం వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో ఏలియన్స్ ఉన్నాయని నిర్ధారించుకోవచ్చా? లేదా ఆ తరంగాలు రావటానికి గల కారణాలేమిటి?అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఏలియన్స్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు అత్యంత ఆసక్తికరంగా మారుతునే ఉన్నాయి.

10TV Telugu News