viral pic : బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ప్రాణి..ఇదేంటబ్బా అంటూ జనాలు ఆసక్తి

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ వింత జీవి సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.అదేంటాని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.

viral pic : బీచ్  ఒడ్డుకు కొట్టుకొచ్చిన ప్రాణి..ఇదేంటబ్బా అంటూ జనాలు ఆసక్తి

Brown Creature Mysterious

brown creature Mysterious : ఈ ప్రపంచంలో ఎన్నో అరుదైన జీవులు..అత్యద్భుతమైన ప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. వింతైనవి..అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమాని ఎన్నో అరుదైన జీవుల్ని చూస్తున్నాం.కానీ ఇంకా కొన్ని కోట్ల జీవులున్నాయి మానవుడి కంటపడకుండా. పరిశోధకులు చాలా అరుదైన జీవుల్ని కనపెట్టారు ఇప్పటి వరకు.వాటిలో చాలావాటి గురించి మనకు తెలియదు.బహుశా చూసి కూడా ఉండం.

Read more : Message in Wine Bottle: సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన వైన్ బాటిల్ లో సీక్రెట్ ఐడీ..

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన గోధుమ రంగులో ఉన్న ఓ ప్రాణి కనిపించింది జనాలకు. అదేమిటో చూసివారికి తెలియట్లేదు.ఇదేంటీ అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి అది ఏంటాని అందరు పరిశీలిస్తున్నారు. అదేంటో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. మరీ మీకేమన్నా తెలిసేమో ఓ లుక్కేయండీ..దీన్ని చూసే ముందు దీని గురించి సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ బీచ్ ఒడ్డుకు గోధుమ రంగులో ఉన్న ఓ ప్రాణి కొట్టుకొచ్చింది. ఈ ప్రాణి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తెగ హల్ చల్ చేస్తోంది. యెప్పూన్‌లోని కెంప్ బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఈ ప్రాణి సీ టమాటో జెల్లీఫిష్, బ్లోబ్ ఫిష్‌లా కనిపిస్తోంది. సొరచేప గుడ్ల ముద్దను కూడా పోలి ఉంది. దీని గురించి సముద్ర నిపుణుడుడాక్టర్ లిసా గెర్షివిన్ మాట్లాడుతు.. అది ‘మేన్ సైనేయా బార్కేరి జెల్లీ ఫిష్’ అని చెప్పేసి ఇకనైనా తెలిసిందా? ఇదేంటో..అంటున్నారు.

Read more : War with Aliens :మూడో ప్రపంచ యుద్ధం ఏలియన్స్ తోనేనా..?!అవే మన క్షిపణుల్ని పనిచేయకుండా చేస్తున్నాయా?