Message in Wine Bottle: సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన వైన్ బాటిల్ లో సీక్రెట్ ఐడీ..

సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన ..వైన్ బాటిల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. దాంట్లోఉన్న ఓ ఐడీ మరింత ఇంట్రెస్ట్ అయ్యింది.

Message in Wine Bottle: సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన వైన్ బాటిల్ లో సీక్రెట్ ఐడీ..

Bottle Travels 4800 Km From Canada To Wales

bottle travels 4800 km from canada to wales: నాగార్జున నటించిన శివమణి సినిమా సముద్రంలో కొట్టుకు వచ్చిన ఓ బాటిల్..దాంట్లో ఉండే ఓ లెటర్ పై నడుస్తుంది. అది సినిమా. కానీ నిజంగానే ఓ వైన్ బాటిల్ సముద్రంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఓ వృద్ధురాలికి దొరికింది. బాటిల్ భలే ఉందే అని తీసుకున్న ఆమె దాంట్లో ఓ చీటి ఉండటం చూసి షాక్ అయ్యింది.ఆ చీటీలో ఉన్న ఓ ఐడీ చూసి ఆమె థ్రిల్ అయిపోయింది. ఇంతకీ ఆ చీటీలో ఉంది..ఈ వైన్ బాటిల్ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం..

అది ద గ్రేట్ బ్రిటన్ లోని ఇంగ్లండ్‌లోని వేల్స్ సముద్ర తీరం. ఈ బీచ్ లో అమందా టిడ్‌మార్ష్ అనే ఓ 52 ఏళ్ల తన కుక్కలతో సరదాగా తిరుగుతోంది. అలా వెళ్తూన్న ఆమెకు ఓ చోట నీటిలో కొట్టుకొస్తున్న ఓ బాటిల్ కనిపించింది. అది అలా కొట్టుకొచ్చి బీచ్ లోని ఇసుకలో చిక్కుకుంది. అదేదో పాత వైన్ బాటిల్ లా కనిపించటంతో ఆమె గబగబా దగ్గరకెళ్లి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అది ఎంతో కాలం నుంచి సముద్రపు నీటిలోనే ఉన్నట్లుగా కనిపించటం..దానికి ఓ ఆల్చిప్పలాంటిది అతుక్కుని ఉండటంతో దానిపై ఇంట్రెస్ట్ పెరిగిందామెకు. దీంతో ఆమె ఇంట్రెస్ట్ గా దాన్ని తీసుకుని ఇంటికెళ్లింది. అది చాలా కాలంగా సముద్రంలోనే ఉందని ఆమెకు అర్థమైంది.

ఇంటికి తీసుకెళ్లిన అమందా దాన్ని అలా ఓ చోట పెట్టి..అదేదో అపురూపమైన వస్తువులా ఫీలవుతూ కూర్చుంది. దాన్ని ఏదో సంబరంగా చిన్నపిల్లలాగా చూస్తుండిపోయింది. ఎంతో పాతకాలం నాటి వైన్ బాటిల్ దొరికిందని సంబరపడిపోయింది. కాసేపు తరువాత ఆ బాటిల్ ను ఫోటోలు తీసి తన కోడలు మాటీకి పంపింది. ఆ ఫోటోలు చూసిన ఆమె కోడలు..‘‘ఆంటీ లేట్ ఎందుకు? దాన్ని ఓపెన్ చేయండి’ అని చెప్పింది. దాంతో… అమందా బాటిల్ ఓపెన్ చేసి చూసింది. దాంట్లో వైన్ లేదు ఏమీలేదు. దాంతో ఆమందా నీరుగారిపోయింది. కానీ దాంట్లో ఓ చిరిగిన లేఖ ఉండటంతో మళ్లీ ఇంట్రెస్ట్ పెరిగింది.

ఆ లేఖను జాగ్రత్తగా బయటకు తీసింది. విప్పి చూడగా.. అందులో కొన్ని వివరాలతో పాటూ”దయచేసి ఈ బాటిల్ మీకు అందినట్లుగా… కింది ఈమెయిల్-ఐడీకి సమాచారం పంపండి” అని ఉంది. ఇది పంపినది నేనే.. అని కింద ఈమెయిల్-ఐడీ కూడా ఉంది.

బాటిల్‌లోని ఆ లేఖను బట్టి చూస్తే..జాన్ గ్రాహమ్ అనే వ్యక్తి 2020 నవంబర్‌లో ఆ లెటర్ వైన్ బాటిల్ లో పెట్టి కెనడాలో సముద్రంలో వదిలినట్లుగా తేలింది. అమందా జాన్ గ్రాహమ్ అనే వ్యక్తికి తనకు ఆ బాటిల్ దొరికిందని మెయిల్ పంపింది. కానీ రిప్లై రాలేదు. మరి ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలియదు. ఆ మెయిల్ అఐడి సదరు వ్యక్తి పంపిచటం ఎంత ఇంపార్టెంట్ అని మాత్రం తెలుస్తోంది. అలా ఆ లెటర్ ఉన్న ఆ వైన్ బాటిల్ కెనడా నుంచి 4,800 కిలోమీటర్లు సముద్ర నీటిలో ప్రయాణించి ఇంగ్లండ్‌లోని అమందాని చేరింది.

ఆ వైన్ బాటిల్ తనకు చేరటం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అంటోంది అమందా. తనలాగా ఇంకెవరికైనా ఇటువంటి ఎక్స్ పీరియన్స్ జరిగిందా అని నెటిజన్లను అడుగుతోంది. కాగా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నౌకల్లో యుద్ధాలు చేసిన చాలా మంది తము చనిపోయే ముందు పేపర్స్ పై తాము ఎవరికి చెప్పాలనుకుంటున్నారో..ఏం చెప్పాలనుకుంటున్నారో రాసి ఆ పేపర్ను బాటిళ్లలో పెట్టి దానికి మూత పెట్టి సముద్రంలో విసిరేసేవారు. ఆ బాటిళ్లు కొంతకాలానికి ఒడ్డుకు చేరేవి. అలా ఫలానా నౌక సముద్రంలో మునిగిపోయిందని గుర్తించేవారు. ఇలా కొన్ని సందర్భాలు కూడా గతంలో జరిగాయి.