Ukraine Russia War: అమెరికా ఉక్రెయిన్‌లో ప్లేగు, ఆంత్రాక్స్ బయో ల్యాబ్ లను నడుపుతోంది: రష్యా

అమెరికా యుక్రెయిన్లో.. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ మరియు ఇతర రోగకారకాలతో కూడిన బయో ఆయుధాలను యుక్రెయిన్ ల్యాబుల్లో అభివృద్ధి చేస్తుందంటూ జఖరోవా ఆరోపించారు.

Ukraine Russia War: అమెరికా ఉక్రెయిన్‌లో ప్లేగు, ఆంత్రాక్స్ బయో ల్యాబ్ లను నడుపుతోంది: రష్యా

Ukriane

Ukraine Russia War: యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండగా.. రష్యా పై అగ్ర దేశాల ఆంక్షలూ, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో తమపై ఆంక్షలు విధిస్తు ఆరోపణలు చేస్తున్నదేశాలపైనా రష్యా మండిపడుతుంది. ముఖ్యంగా అమెరికా పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. బుధవారం రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా యుక్రెయిన్లో.. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ మరియు ఇతర రోగకారకాలతో కూడిన బయో ఆయుధాలను యుక్రెయిన్ ల్యాబుల్లో అభివృద్ధి చేస్తుందంటూ జఖరోవా ఆరోపించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈమేరకు మారియా జఖరోవా ఈ ఆరోపణలు చేశారు.

Also read: Russia-ukraine war : ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట పాడిన యుక్రెయిన్ మిలిటరీ బ్యాండ్

ఉక్రెయిన్‌ బయో ల్యాబ్‌లలో ప్లేగు మరియు ఆంత్రాక్స్‌తో కూడిన బయో ఆయుధాల అభివృద్ధిలో అమెరికా ప్రమేయం ఉందని, ఈ విషయంలో అమెరికా స్పందించి పారదర్సకతను ప్రదర్శించాలని జఖరోవా డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను యుక్రెయిన్, అమెరికా ప్రతినిధులు ఖండించారు. జఖరోవా ఆరోపణలు “పూర్తి అసంబద్ధం’గా అభివర్ణించారు. అంతేకాదు.. అమెరికా – యుక్రెయిన్ చేపడుతున్న ఈ బయో ఆయుధాల అభివృద్ధికి సంబంధించి తమ వద్ద కీలక పత్రాలు కూడా ఉన్నట్లు జఖరోవా పేర్కొంది. ల్యాబుల్లో అభివృద్ధి చేసిన ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ మరియు ఇతర వ్యాధికారక నమూనాలను నాశనం చేయాలని ఉక్రేనియన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ శాస్త్రవేత్తలను ఆదేశించిందని.. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లో ఉన్న “రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్” సమయంలో బయటపెట్టినట్లు జఖరోవా తెలిపింది.

Also read: Russia-ukraine war: దేశం వదిలిపోతున్న ప్రియురాలు..‘పెళ్లిచేసుకుందాం ప్రియా’అంటూ యుక్రెయిన్ సైనికుడి ప్రపోజ్

ఫిబ్రవరి 24కి ముందు జరిగిన ఈ విషయం తాలూకు వివరాలు తమ వద్ద ఉన్నాయన్న జఖరోవా..ఫిబ్రవరి 24న రష్యా సైన్యం యుక్రెయిన్ పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. రష్యా ఆరోపిస్తున్నట్లుగా యుక్రెయిన్ ల్యాబుల్లో జీవ ఆయుధాల తయారీకి పెంటగాన్(అమెరికా ఆర్మీ) నుంచి ఆర్ధిక సహాయం అందినట్లు జఖరోవా ఆరోపించారు. “అక్కడ శాంతి చర్చలు లేవు, శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు.. మరి మీరు యుక్రెయిన్ ల్యాబుల్లో ఎందుకున్నట్టు” అంటూ అమెరికా ప్రతినిధులను రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై అమెరికా స్పందించాలని, ప్రపంచానికి నిజాలు వెల్లడించాలని జఖరోవా డిమాండ్ చేశారు.

Also read: Russia Ukraine War : యుక్రెయిన్‌‌కు సాయం చేస్తానన్న పోలాండ్.. అడ్డుచెప్పిన అమెరికా..!