Russia-ukraine war: దేశం వదిలిపోతున్న ప్రియురాలు..‘పెళ్లిచేసుకుందాం ప్రియా’అంటూ యుక్రెయిన్ సైనికుడి ప్రపోజ్

dష్యా బాంబు దాడులు, తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్న యుక్రెయిన్ గడ్డపై రెండు ప్రేమ హృదయాల భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశం వదలిపోతున్న ప్రియురాలితో పెళ్లి చేసుకుందాం..

Russia-ukraine war: దేశం వదిలిపోతున్న ప్రియురాలు..‘పెళ్లిచేసుకుందాం ప్రియా’అంటూ యుక్రెయిన్ సైనికుడి ప్రపోజ్

Ukrainian Soldier Proposes To Girlfriend

Ukrainian Soldier Proposes to Girlfriend : రష్యా బాంబు దాడులు, తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్న యుక్రెయిన్ గడ్డపై రెండు ప్రేమ హృదయాల భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణరంగంగా..శ్మశానాల దిబ్బగా మారిపోతున్న యుక్రెయిన్‌ను వదిలిపోతున్న ప్రియురాలికి యుక్రెయిన్ సైనికుడు పెళ్లి ప్రపోజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని ఫాస్టివ్ చెక్‌పోస్ట్‌ సోమవారం (మార్చి7,2022) ఈ ప్రేమ భావోద్వేగపు అత్యంత అరుదైన అద్భుతమైన దృశ్యానికి వేదికైంది.

Also read : Russia Ukraine War : యుక్రెయిన్‌‌కు సాయం చేస్తానన్న పోలాండ్.. అడ్డుచెప్పిన అమెరికా..!

కీవ్ నగరాన్ని వీడుతున్న ప్రజలను చెక్‌పోస్ట్‌ వద్ద ఉక్రెయిన్‌ సైనికులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరు తమ వాహనం దిగి చేతులను కారుపై పెట్టి వెనక్కి నిల్చొని ఉన్నారు. ఉక్రెయిన్‌ సైనికులు వారి కారును, ధృవీకరణ పేపర్లను పరిశీలిస్తున్నారు.

అలా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో తన ప్రియురాలు కూడా ఉ:దని అక్కడ ఉన్న సైనికుల్లో ఒక సైనికుడు గుర్తించాడు. తనిఖీ కోసం వెనక్కి నుల్చొన్న ఆమె వద్దకు వెళ్లి మోకాలిపై కూర్చొని ఆమెను తట్టాడు. ఏంటాని ఆమె వెనుతిరిగింది. అంతలో సదరు సైనికుడు ఒక చేతిలో ఉంగరం, మరో చేతిలో పుష్ఫగుచ్చంతో పెళ్లి ప్రపోజ్‌ చేసిన ప్రియుడ్ని చూసి ఆమె షాక్‌ అయ్యింది.

ఒక్కక్షణం…ఒకే ఒక్క క్షణం ఆమె హృదయం స్థంభించిపోయింది. ముఖాన్ని అరచేతులతో కప్పుకుంది. వెంటనే తన ప్రియుడ్ని చూసి సంతోషంతో హత్తుకుంది. అతని ముఖంపై ముద్దు పెట్టుకున్నది. ఆ వెంటనే అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. అనంతరం వారిద్దరు కౌగిళ్లలో, ముద్దుల్లో మునిగిపోయారు. దీంతో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు చప్పట్లతో ఆ జంటకు అభినందనలు తెలిపారు. వీడియోలు తీశారు.

Also read : Anand Mahindra: రూ.12వేలకే జీప్ దొరికేది.. ఆ రోజులే బాగున్నాయంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న కొందరు మీడియా సిబ్బంది, యుక్రెయిన్ సైనికులు తమ మొబైల్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు దీనిపై స్పందించడంతోపాటు వీడియోను షేర్‌ చేశారు. ‘యుద్ధం కాదు… ప్రేమను పంచండి. యుద్ధ సమయంలో హృదయాన్ని కదిలించే దృశ్యం’ అని ఒకరు అంటున్నారు. ఈ జంట ఒక్కటి కావాలని కోరుకుందాం. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసి ఆ జంట ఒక్కటి అయి సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుందాం..