Russia: సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. తమ ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్

తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.

Russia: సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. తమ ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్

Russia: దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న రష్యా–యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూడటం లేదు. రష్యా, యుక్రెయిన్.. రెండు దేశాలూ యుద్ధానికి సంబంధించి తమకు అనుకూలమైన ప్రకటనలు చేసుకుంటున్నాయి.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది. సొలెడార్ నగరం రష్యా స్వాధీనం కాలేదని, ఇంకా తీవ్ర యుద్ధం కొనసాగుతోందని ప్రకటించింది. అయితే, ఈ పట్టణం ఇప్పటికే చాలా వరకు ధ్వంసమైంది. యుద్ధం ప్రారంభమైన ఇంతకాలం తర్వాత ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించగా, ఈ నగరం ఇంకా తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్ చెప్పింది.

MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

యుక్రెయిన్‌పై విజయం సాధించాలంటే రష్యాకు ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది యుక్రెయిన్‌లోని డోనెస్క్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం స్వాధీనమైతే యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే, ఈ నగరానికి సంబంధించి అమెరికా అంచనా ప్రకారం దీనికి అంతగా ప్రాధాన్యం లేదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా పై చేయి సాధించవచ్చని యుక్రెయిన్ భావిస్తోందని, కానీ, ఈ అంచనా సరికాదని అమెరికా అభిప్రాయం.