India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

ఈ సైనిక విన్యాసాల్లో ఇండియాతో కలిసి అనేక ఆఫ్రికా దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ విన్యాసాల వల్ల ఇండియా–ఆఫ్రికా దేశాల మధ్య సైనిక సహకారం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

India: సైనిక విన్యాసాల పరంగా తొలిసారిగా ఇండియా–ఆఫ్రికా చేతులు కలపబోతున్నాయి. రాబోయే మార్చిలో ఇండియా–ఆఫ్రికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.

Uttar Pradesh: మతం మార్చుకోలేదని భర్త ఘాతుకం.. భార్యపై శారీరక వేధింపులు

ఈ సైనిక విన్యాసాల్లో ఇండియాతో కలిసి అనేక ఆఫ్రికా దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ విన్యాసాల వల్ల ఇండియా–ఆఫ్రికా దేశాల మధ్య సైనిక సహకారం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. గత ఏడాది గుజరాత్‌లోని గాంధీనగర్‌‌లో ఇరు దేశాల సైనిక విభాగాల మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మార్చిలో పూనేలో ఈ విన్యాసాలు జరుగుతాయి.

Kodi Kathi Case : కోడి కత్తి కేసులో NIA కోర్టు సంచలన వ్యాఖ్యలు .. జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే,అప్పుడే విచారిస్తామన్న కోర్టు

ముందుగా ప్రాథమిక స్థాయిలోనే సైనిక విన్యాసాలు ఉంటాయి. ఆ తర్వాత భవిష్యత్తులో పెద్ద స్థాయిలో సైనిక విన్యాసాల్ని నిర్వహిస్తారు. ఆఫ్రికాలోని అన్ని దేశాలు దీనిలో పాల్గొంటాయి. అన్ని దేశాల సైన్యాధ్యక్షులు కూడా దీనికి హాజరవుతారు. ‘‘ఆఫ్రికాతో సంబంధాల్ని భారత్ మెరుగుపర్చుకోవాలి అనుకుంటోంది. శాంతి, భద్రత, స్థిరత్వం, అభివృద్ధిలో సహకారాన్ని కోరుకుంటోంది.

2018లో ప్రధాని మోదీ ఆఫ్రికాలోని ఉగాండాలో పర్యటించిన సందర్భంగా ఆఫ్రికాతో సంబంధాలు పెంచుకునేందుకు పది సూత్రాల ప్రణాళికను సిద్ధం చేసింది” అని గతంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.