Kodi Kathi Case : కోడి కత్తి కేసులో NIA కోర్టు సంచలన వ్యాఖ్యలు .. జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే,అప్పుడే విచారిస్తామన్న కోర్టు

కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలైన బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది.

Kodi Kathi Case : కోడి కత్తి కేసులో NIA కోర్టు సంచలన వ్యాఖ్యలు .. జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే,అప్పుడే విచారిస్తామన్న కోర్టు

Kodi Kathi Case

Updated On : January 13, 2023 / 4:25 PM IST

Kodi Kathi Case : కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలైన బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను జనవరి (2023)31కు వాయిదా వేసింది.

ఏపీలోని విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో తీవ్ర సంచలనం రేపిన కోడి కత్తి కేసు విచారణలో శుక్రవారం (జనవరి 13,2023) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరపు న్యాయవాదిని కీలక ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టింది. ఈ కేసులో అసలు బాధితుడిగా ఉన్న జగన్ ను ఎందుకు ఇంతకాలం ప్రశ్నించలేదు? జగన్ ను ఎందుకు కోర్టుల హాజరుపరచలేదు? అని ప్రశ్నించింది. జగన్ కోర్టుకు హాజరయ్యేకే విచారణ చేస్తాం అని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కు భారీ ఝలక్ అని చెప్పాలి.

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ 2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత ప్రస్తుత జగన్ పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పెను సంచలనంగా మారింది. పాదయాత్ర చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న జగన్ పై శ్రీనివాస్ చేసిన దాడిలో ఆయన భుజానికి చిన్నపాటి గాయమైంది. దీంతో జగన్… వైజాగ్ లో ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఈ కేసును కోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తునే ఉంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ ఇప్పించాలని అతని కుటుంబ జగన్ చుట్టూ తిరుగుతునే ఉంది. అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. నిందితుడు శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతునే ఉన్నాడు.

జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు మరోసారి దరఖాస్తు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..ఈరోజు కీలక ఆదేశాలు ఇస్తూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని కీలక ప్రశ్నలు వేసింది. కోడికత్తి శ్రీను బెయిల్ తిరస్కరణ వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్ధనను విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఈరోజ కూడా తోసిపుచ్చింది.

కోడి కత్తితో దాడి తర్వాత అరెస్టైన శ్రీను..అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో జగన్ నుంచి నిరభ్యంతర పత్రం కోసం శ్రీను తల్లితండ్రులు సీఎం క్యాంపు కార్యాలయానికి తిరుగుతునే ఉన్నారు.అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనాలేదు. వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు. సీఎం జగన్ నుంచి ఎన్వోసీ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసినా వారికి ఆశాభంగం తప్పటంలేదు. ఈ క్రమంలో ఈరోజు కోర్టు ప్రశ్నలు జగన్ ను ఇరకాటంలో పెట్టినట్లుగా ఉన్నాయని చెప్పాల్సి ఉంది.

జగన్ ను రావాల్సిందేనన్న ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు రావాలని కూడా ఎన్ఐఏ కోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో బాధితుడైన జగన్ ఇప్పటివరకూ కోర్టుకు రాకపోవడంపై న్యాయస్ధానం అభ్యంతరం తెలిపింది. జగన్ కోర్టుకు హాజరైన తరువాత ట్రయల్ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది.