Uttar Pradesh: మతం మార్చుకోలేదని భర్త ఘాతుకం.. భార్యపై శారీరక వేధింపులు

లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు. తన పేరు మౌర్యగా చెప్పి, ఆమెను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు.

Uttar Pradesh: మతం మార్చుకోలేదని భర్త ఘాతుకం.. భార్యపై శారీరక వేధింపులు

Updated On : January 13, 2023 / 3:50 PM IST

Uttar Pradesh: మతం మారేందుకు ఒప్పుకోలేదని ఒక భర్త తన భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు.

PM Modi: మోదీకి దండ వేసేందుకు బారికేడ్లు దాటుకెళ్లిన యువకుడు.. భద్రతా వైఫల్యం లేదన్న అధికారులు

తన పేరు మౌర్యగా చెప్పి, ఆమెను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. ఇది నిజమే అనుకుని నమ్మిన ఆ మహిళ అతడికి దగ్గరైంది. కొంతకాలం ఇద్దరూ కలిసి స్థానికంగా ఒక చోట అద్దెకుంటూ సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి అతడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతడు ముస్లిం అనే విషయం అప్పుడు బయటపడింది. అయితే, అతడు ఆమెను మతం మారమని వేధించేవాడు.

Anand Mahindra ‘Natu Natu Song’ : ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ.!!

లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడు. కానీ, మతం మారేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఒంటిపై వేడి నూనె కూడా పోశాడు. ఇస్లాంలోకి మారకపోతే తనను స్నేహితులతో అత్యాచారం చేయిస్తానని బెదిరించాడు. ఆమె ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ, అతడు అడ్డుకున్నాడు. తన భార్యను గదిలో బంధించి మరింత వేధించేవాడు.

అయితే, ఎలాగోలా దీన్నుంచి ఆమె బయటపడింది. లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాధిత మహిళ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.