HIV Cure WithOut Medicine:మందులు వాడకుండానే HIV నుంచి కోలుకున్నవ్యక్తి..ఈరహస్యం ఛేదిస్తే బాధితులకు శుభవార్తే

ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ నుంచి మరో బాధితవ్యక్తి కోలుకున్నారు.మందులు వాడకుండానే హెచ్ఐవీ నుంచికోలుకోవటంతో ఈసీక్రెట్ ఛేదిస్తే విప్లవాత్మక మార్పులుతేవచ్చని శాస్త్రవేత్తలుభావిస్తున్నారు

HIV Cure WithOut Medicine:మందులు వాడకుండానే HIV నుంచి కోలుకున్నవ్యక్తి..ఈరహస్యం ఛేదిస్తే బాధితులకు శుభవార్తే

Hiv Cure Without Medicine

Elite Controllers Give Hope for an HIV Cure : హెచ్ఐవీ (human immunodeficiency viruse).దీన్ని ఎయిడ్స్ అని అంటాం. ఇది ఒక్కసారి సోకింది అంటే భరించాల్సిందే. జీవితానికి గుదిబండ. దాన్ని మోయాల్సిందే. హెచ్ఐవీ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి ఇప్పటివరకు ఎటువంటి మెడిసిన్ లేదు. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చేసుకోవటం ద్వారా మాత్రమే జీవితాన్ని ముందుకు సాగించగలం. ఇది సోకితే అది ముదరకుండా ఉంటానికి మాత్రం యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అందుకే..హెచ్ఐవీకి నివారణ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తుంటారు.హెచ్చరిస్తుంటారు.

అటువంటి భయంకరమైన హెచ్ఐవీ వ్యాధి నుంచి గతంలో శాన్‌ఫ్రాన్సిస్కో వ్యక్తి బయటపడ్డారు. ఈక్రమంలో మరో వ్యక్తి కూడా హెచ్ఐవీ నుంచి పూర్తిగా బయటపడిందో మహిళ. అది కూడా ఎటువంటి మందులు వాడకుండానే.పైగా పూర్తిగా కోలుకున్నారు. దీంతో శాస్త్రవేత్తలు ఆనందాశ్చర్యాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది చాలా మిరాకిల్ అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకేముంది శాస్త్రవేత్తలు కదా..ఇక పరిశోధనలు ప్రారంభించేశారు. హెచ్ఐవీ నుంచి కోలుకున్నవారిపై దృష్టిసారించారు. వారిలో రోగ నిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయి? అనేదానిపై పరిశోధనలు ప్రారంభించారు. దీని రహస్యం తెలిస్తే ఇక హెచ్ఐవీ బాధితులకు కొత్త జీవితం లభించినట్లేనంటున్నారు. ఈ రహస్యాన్ని ఛేదిస్తే హెచ్ఐవీ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Read more : Latin American Artist : అరుదైన పెయింటింగ్..చాలా కాస్ట్ గురూ

అర్జెంటీనాలోని 30 ఏళ్ల మహిళ తన సొంత రోగ నిరోధక శక్తి ద్వారా తనకున్న హెచ్ఐవీని జయించారు. దీంతో హెచ్ఐవీ సోకి దాన్నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు 2013లో హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హెచ్ఐవీ సోకాక ఆమెను వివక్షలను ఎదుర్కొన్నారు. అవమానాలను ఎదుర్కొన్నారు. బాధపడేవారు.కృంగిపోయేవారు.కానీ కృంగిపోయినంత మాత్రాను తాను దీన్నుంచి బయటపడగలనా? ఎందుకు నేను సాధారణ జీవితం జీవించకూడదు? అని ప్రశ్నించుకున్నారు. తనను తాను ధైర్యపరుచుకుంది. అలా తనకు హెచ్ఐవీ ఉందనే విషయం మర్చిపోయి సాధారణంగా జీవించింది. కనీసం ఎటువంటి మెడిసిన్స్ కూడా వాడలేదు.కానీ చిత్రం..విచిత్రం ఆమెలో ఉండే హెచ్ఐవీ వ్యాధి మాయమైపోయింది.

శరీరంలోకి హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత అది తన జన్యురాశిని ఇతర కణాల డీఎన్ఏలోకి చొప్పించి వాటిని వైరల్ రిజర్వాయర్లుగా మార్చుతుంది. ఆ తర్వాత వీటి నుంచి వైరస్ పుట్టుకొస్తుంది. హెచ్ఐవీ కోసం అందుబాటులోకి వచ్చిన రిట్రో వైరల్ డ్రగ్స్ ఈ రిజర్వాయర్లపై పనిచేసినప్పటికీ వాటిని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం వాటికి లేదు. అయితే, కొత్తగా వైరస్ పుట్టకుండా మాత్రం అడ్డుకుంటుంది. దీంతో వ్యాధి ముదరకుండా ఉంటుంది.

Read more : Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

అయితే, కొంతమంది వ్యక్తుల్లోని రోగ నిరోధక వ్యవస్థలు ఎలాంటి ఔషధాలు లేకుండానే వైరస్‌ను అణచివేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులను ‘ఎలైట్ కంట్రోలర్స్’గా పిలుస్తుంటారు. మెడిసిన్స్ అవసరం లేకుండానే హెచ్ఐవీ నుంచి బయటపడడాన్ని ‘స్టెరిలైజింగ్ క్యూర్’గా పిలుస్తారు. తాజాగా రెండో వ్యక్తి అయిన అర్జెంటీనా మహిళ కూడా ఇలానే బయటపడినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆ వ్యక్తి నుంచి మసాచుసెట్స్‌లోని పరిశోధకులు సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పట్టిపట్టి పరీక్షించారు.ఒక బిలియన్ కంటే ఎక్కువ కణాల DNA ను నిశితంగా స్కాన్ చేశారు. కానీ ఎక్కడా హెచ్ఐవీ జినోమ్ జాడ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఎలైట్ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతుందో కనుక తెలుసుకోగలిగితే హెచ్ఐవీకి పరిష్కారం లభించినట్టేనని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు. బాధితుల రోగ నిరోధక వ్యవస్థలు తమంత తాముగా స్టెరిలైజింగ్ క్యూర్‌ను చేపట్టేలా ప్రయోగాలు జరుపుతున్నట్టు వివరించారు.