Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని  కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారని, వారి వల్లే కాలుష్యం పెరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

Delhi

CJI NV Ramana : ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని  కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారని, వారి వల్లే కాలుష్యం పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమితో రైతులకు వచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా ? అంటూ ప్రశ్నించారు. కాలుష్యంపై టీవీల్లో జరుగుతున్న చర్చలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసింది. పంట వ్యర్థాలు దహనం చేయడంపై రైతులను శిక్షించడం తమకు ఇష్టం లేదని, వారం రోజుల పాటు వాటిని తగుబెట్టవద్దని రైతులను కోరాలని ఇప్పటికే కేంద్రాన్ని సూచించడం జరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

Read More : Nurse Jyoti Gawli dies : 5,000 మందికి పురుడు పోసిన నర్సు..తన రెండో కాన్పులో మృతి

టీవీల్లో జరుగుతున్న చర్చల్లో ఎవరికి వారు వారి అజెండా ప్రకారం మాట్లాడుతున్నారని, గణాంకాలు చెప్పి పార్టీలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఒక పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు. పంట వ్యర్థాల దహనంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సమాచారం అందించిన నేపథ్యంలో 2021, నవంబర్ 17వ తేదీ బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు..ఇలాంటి విమర్శలు వస్తుంటాయని, మీ మనస్సాక్షి సరిగ్గా ఉంటే…అవేం అతిపెద్ద సమస్య కాదన్నారు. వాటిని మరిచిపోవాలని, ఇతర విషయాలు లేవనెత్తితే అసలు సమస్య పరిష్కారం కాదన్నారు.

Read More : Covid Cucumber : ఇదేందిరా బాబూ? ఇవి దోసకాయలా? కరోనా వైరసా?..!!

ప్రతిదీ కోర్టు ఆదేశాలతోనే జరగడం సాధ్యం కాదని, ప్రతొక్కరూ దీనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై తుది విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది. ఢిల్లీ సరిహధ్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా..ఢిల్లీ వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.