Covid Cucumber : ఇదేందిరా బాబూ? ఇవి దోసకాయలా? కరోనా వైరసా?..!!

ఇదేందిరా బాబూ? ఈ కరోనా కాలంలో అన్ని ఇసిత్రాలే..అచ్చు కరోనా వైరస్ లాంటి దోసకాయలు సోషల్ మీడియాలో వామ్మో కరోనానా? దోసకాయలా?అనిపిస్తున్నాయి.

Covid Cucumber : ఇదేందిరా బాబూ? ఇవి దోసకాయలా? కరోనా వైరసా?..!!

Covid Cucumber (1)

Covid Cucumber : దోసకాయలు సాధారణంగా నున్నగా ఉంటాయి. కానీ ఇది కరోనా కాలంలో కాసిన ఈ దోసకాల్ని చూస్తే ఇవి దోసకాయలా? కరోనా వైరసా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దోసకాయలకు ముళ్లు ఉన్నాయి. ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ జిల్లా బాబుగావ్‌ సమితి పరిధిలోని సరగూడ గ్రామానికి చెందిన చంద్రపూజారి ఇంటి ఆవరణలోని దోస తీగకు ఇలా ముళ్లతో కూడిన కాయలు కాశాయి.

ఈ కాయలపై సన్నగా ముళ్లులాంటివి ఉన్నాయి. ఈ దోసకాయలపై సన్నగా బొడిపెలతో చూడటానికి కరోనా వైరస్‌ ఆకారంలో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా వైరస్ షేపులో ఉన్న ఈ దోసకాయలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొక్కల్లోని వివిధ భాగాలు ఇలా రూపాంతరం చెందడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు.