Peddi Promotions : ఇది కదా ప్లానింగ్ అంటే.. ‘పెద్ది’ పాన్ ఇండియా ప్రమోషన్స్.. ‘పెద్ది’ పవర్ ప్లే టూర్.. 8 రోజులు 7 సిటీలు..
ప్రమోషన్స్ కూడా భారీగా పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేసారు. (Peddi)
Ram Charan Peddi Movie Pan India Promotions Power Play Tour
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీగా పెద్ది సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన రెండు గ్లింప్స్, రెండు సాంగ్స్ మాత్రం సినిమాకు భారీ హైప్ ని తీసుకొచ్చాయి. పెద్దిలో చరణ్ కుస్తీ, క్రికెట్ రెండూ ఆడబోతున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పెద్ది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ కూడా భారీగా పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేసారు. ఓ అభిమాని పెద్ది ప్రమోషన్స్ ఎక్కడ అని అడుగుతూ లెటర్ రాయడంతో పెద్ది టీమ్ పవర్ ప్లే టూర్ అంటూ ప్రమోషన్స్ కి సంబంధించిన ఓ లెటర్ ని విడుదల చేసింది. ఇందులో ఏ రోజు ఎక్కడ పెద్ది ఈవెంట్స్ జరుగుతాయో ప్రకటించింది.
Also Read : Pawan Kalyan : శస్త్ర చికిత్స తర్వాత తొలిసారి క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్.. ఫొటోలు..
18వ తేదీన ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించి పెద్ది ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మే 22వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఓ ఈవెంట్ ఉంది. ఇక్కడ భారీగా ఏ ఆర్ రహమాన్ తో పెద్ది కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు అని సమాచారం. 23 భోపాల్ లో పెద్ది సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. 24న బెంగళూరులో ఒక ఈవెంట్, 28 ఢిల్లీలో ఓ ఈవెంట్, 30న చెన్నైలో ఓ ఈవెంట్, జూన్ 1న విజయనగరంలో ఫ్యాన్స్ తో భారీ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ సినిమా కథ విజయనగరం బ్యాక్ డ్రాప్ లోనే సాగనుంది. ఇక జూన్ 2న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా అభిమానుల మధ్య నిర్వహించనున్నారు.
ఇలా 8 రోజుల్లో 7 నగరాల్లో పెద్ది ఈవెంట్స్ ప్లాన్ చేసింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా పాన్ ఇండియా ప్రమోషన్స్ అని అంటున్నారు. ట్రైలర్ లాంచ్ తో పెద్ది ఫీవర్ మొదలవ్వనుంది.
#PEDDI – Mana Cinema Aadukodam Gurinche 💥
Get ready for the games 🥰
In cinemas JUNE 4th ❤️ https://t.co/f41uSE09yc pic.twitter.com/4QChYp8BxW— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
Also Read : Memu Coplam : ‘మేము కాప్లం’ ట్రైలర్ వచ్చేసింది.. సలార్ రాజు మిస్సింగ్..
