Covid Cucumber : దోసకాయలు సాధారణంగా నున్నగా ఉంటాయి. కానీ ఇది కరోనా కాలంలో కాసిన ఈ దోసకాల్ని చూస్తే ఇవి దోసకాయలా? కరోనా వైరసా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దోసకాయలకు ముళ్లు ఉన్నాయి. ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లా బాబుగావ్ సమితి పరిధిలోని సరగూడ గ్రామానికి చెందిన చంద్రపూజారి ఇంటి ఆవరణలోని దోస తీగకు ఇలా ముళ్లతో కూడిన కాయలు కాశాయి.
ఈ కాయలపై సన్నగా ముళ్లులాంటివి ఉన్నాయి. ఈ దోసకాయలపై సన్నగా బొడిపెలతో చూడటానికి కరోనా వైరస్ ఆకారంలో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా వైరస్ షేపులో ఉన్న ఈ దోసకాయలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొక్కల్లోని వివిధ భాగాలు ఇలా రూపాంతరం చెందడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు.