Nurse Jyoti Gawli dies : 5,000 మందికి పురుడు పోసిన నర్సు..తన రెండో కాన్పులో మృతి

5,000 గర్భిణులకు ప్రసవాలు చేసిన పండంటి బిడ్డలను అందించిన నర్సు తన రెండో కాన్పులో మృతి చెందింది.

Nurse Jyoti Gawli dies : 5,000 మందికి పురుడు పోసిన నర్సు..తన రెండో కాన్పులో మృతి

Nurse Jyoti Gawli Dies After 5000 Successful Deliveries

Nurse Jyoti Gawli dies after 5,000 successful deliveries : మహారాష్ట్రకు చెందిన జ్యోతి గావ్లీ అనే నర్సు చేయి పడితే ఎంత కష్టమైన కాన్పు అయినా సులువుగా జరిగిపోతుంది. ఎంతోమంది గర్భిణులకు పురుడు పోసిన జ్యోతిగావ్లీ ఎంతోంది తల్లులకు ఆనందాన్నిచ్చింది. అలా 10మంది కాదు 20మంది కాదు ఏకంగా జ్యోతిగావ్లీ 5,000మందికి గర్భిణులకు పురుడు పోసి బిడ్డ బొడ్డుతాడు కోసి తల్లి ఒడులను నిపింని నర్సు జ్యోతి గావ్లి మాత్రం తన ప్రసవం సమయంలో కన్నుమూసింది. జ్యోతి మరణం గురించి తెలిస్తే దురదృష్టమంటే ఇదేనేమో అనిపిస్తోంది. 5,000 మందికి పురుడు పోసి.. తల్లీపిల్లలను సురక్షితంగా ఇళ్లకు పంపించిన ఓ నర్సు జ్యోతిగావ్లీ తన రెండో కాన్పు సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించింది.

Read more : 4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..

మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జ్యోతి గావ్లీ అనే 38 ఏళ్ల నర్సు గత ఐదేళ్లలో సుమారు 5 వేల మందికి పురుడు పోశారు. ఆమె గర్భవతి అయిన జ్యోతి ఆస్పత్రిలో రెండోబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం తరువాత వచ్చిన కొన్ని సమస్యలతో మంగళవారం (నవంబర్ 16,2021) జ్యోతిగావ్వీ మరణించింది.

నవంబర్ 2న జ్యోతి ప్రసవించింది. అదే సమయంలో జ్యోతికి బైలేటరల్‌ నిమోనియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తీవ్రంగా రక్తస్వాయం అయ్యింది. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడికి వెళ్లాక పరిస్థితి కాస్త మెరుగుపడంది అనుకున్న సమయంలో మరోసారి పరిస్థితి విమషమించటంతో జ్యోతి నాందేడ్ ఆసుపత్రిలోనే చికిత్స ప్రాణాలు విడిచింది. జ్యోతి మరణాన్ని డాక్టర్లు దృవీకరించారు. ప్రసవం జరగడానికి ముందు రోజు వరకు జ్యోతి హింగోలీలోని ప్రజా వైద్యశాలలో పనిచేశారని ఆసుపత్రి రెసిడెంట్‌ మెడికల్‌ అధికారి గోపాల్‌ కదమ్‌ తెలిపారు.

Read more : Hungry American Army :ఆకలితో అల్లాడుతున్న అమెరికా ఆర్మీ కుటుంబాలు..పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్న దుస్థితి