Hungry American Army :ఆకలితో అల్లాడుతున్న అమెరికా ఆర్మీ కుటుంబాలు..పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్న దుస్థితి

అగ్రరాజ్యం అమెరికా ఆర్మీ కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయి.కరెంట్ బిల్లులు కట్టలేక చీకట్లోను.. పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయిని ‘ఫీడింగ్ అమెరికా’సంస్థ తెలిపింది

Hungry American Army :ఆకలితో అల్లాడుతున్న అమెరికా ఆర్మీ కుటుంబాలు..పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్న దుస్థితి

Hungry American Army (1)

Hungry American Army : అగ్రరాజ్యం అమెరికా. అమెరికా సైన్యం ధాటికి ఎన్నో దేశాలు వణికిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది అమెరికా ఆర్మీ. అమెరికా సైన్యం మోహరించింది అంటే ఆదేశం వారికి దాసోహం అనాల్సిందే. ఇరాక్ కు నేలమట్టం చేసి నియంత సద్దాం హుసేన్ తుదముట్టించిన ఘనత అమెరికాది. అమెరికా ఆర్మీ చాలా శక్తివంతమైనది.అటువంటి అమెరికా జవాన్ల కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నాయి. అమెరికాలో దాదాపు 1,60,000 మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ ఇది నమ్మాల్సిన నిజం.

ఈ విషయాన్ని ‘ఫీడింగ్‌ అమెరికా’ సంస్థ వెల్లడించింది.. కరోనా దెబ్బకు అమెరికా కూడా అబ్బా అనాల్సి వచ్చింది. కరోనా విశ్వరూపానికి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు సైతం వణికిపోయాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈనాటికి ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి అమెరికా కూడా అతీతం కాదు. కరోనా సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దిగువస్థాయిలో పనిచేసేవారు వారికొచ్చే జీతాలతో బతకలేకపోతున్నారు.వారి కుటుంబాల్ని పోషించుకోలేకపోతున్నారు. వారికొచ్చే జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు.

Read more : న్యూయార్క్ లో ఒక్కపూట తిండి కోసం అల్లాడుతున్న 20లక్షలమంది: అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

దానికి కారణం గతంలో జవాన్లకు వచ్చే జీతాలకు తోడి వారి భార్యలు ఉద్యోగాలు చేస్తు కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉండేవారు. కానీ కరోనా వల్ల చాలా మంది సైనికుల భార్యలు ఉద్యోగాలు కోల్పోయారని ఫీడింగ్‌ అమెరికా పేర్కొంది. కరోనాకు ముందు సైనికుల భార్యలూ ఉద్యోగాలు చేసేవారు. అలా తమ భర్తలకు వచ్చే ఆదాయానికి తోడు తాము సంపాదించే ఆదాయంతో రెండూ కలిపి కుటుంబం కోసం ఖర్చు చేసుకునేవారు.దీంతో వారికి ఆర్థిక సమస్యలు అంతగా ఉండేవి కాదు.కానీ కరోనా వచ్చింది. ఎంతో మంది జీవితాలను తల్లక్రిందులు చేసింది. కోట్లాదిమందిని నడిరోడ్డుపాలు చేసింది.

ఈక్రమంలో కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన భర్తలకు వచ్చే జీతాలు సరిపోక అమెరికా ఆర్మీ కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొటున్నారు. వారి ఆర్థిక సమస్యలు ఎంతగా ఉన్నాయి? అంటే ఆకలితో అల్లాడిపోయి ఉచిత ఆహారం కోసం లైన్లలో నిలబడేంతగా మారిపోయింది వారి దుస్థితి.కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోవటంతో అమెరికా జవాన్ల కుటుంబా పరిస్థితి కూడా తల్లక్రిందులు అయిపోయింది. ఇంట్లో పిల్లలకు వేళకు తిండి కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ చేదు నిజం..కఠిన వాస్తవం సాధారణ అమెరికన్లకు తెలియకపోవచ్చు. కానీ అమెరికా సైన్యంలో చాలా మందికి తెలుసు?

Read more : Hunger Deaths : దేశంలో ఆకలి చావులు ఉండకూడదు..ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు

తమ దుస్థితి గురించి ఇరాక్‌ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్‌హాక్‌ పైలట్‌ టేమీ డక్‌వర్త్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా టేమీ మాట్లాడుతు..‘‘ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంలో మేం బాధ్యతలు నిర్వర్తించాం. కానీ మా కుటుంబాలు మాత్రం ఆకలితో అల్లాడుతున్నాయి. కడుపునింపుకోవటానికి పట్టెడు తిండి దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటంపై వారెలా దృష్టి పెట్టగలరు? అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉంది. కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే మా కుటుంబాలు జీవిస్తున్నాయని ఇంతటి దుర్భర పరిస్థితుల్లో మేం బతుకున్నామని తెలిపారు. సెయింట్ లూయిస్ లో ఫుడ్ బ్యాంక్ నిర్వహించే నాప్ అనే ఓ మహిళ మాట్లాడుతు..కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో చీకట్లోనే జీవిస్తున్న ఓ యువ సైనికాధికారి కుటుంబం గురించి నాకు తెలుసని ఆమె తెలిపారు. సైన్యం పనిచేస్తు మరొకరి వద్ద చేతులు చాచి సహాయం అడగటం అగౌరవంగా భావిస్తారు. అందుకే చాలా సైనికులు కుటుంబాలు తిండి దొరకక ఇబ్బందిపడుతున్నారని అయినా వారు బయటకు చెప్పుకోవటంలేదని నాప్ ఆవేదన వ్యక్తంచేశారు. సైన్యంలో దిగువస్థాయి ర్యాంకుల్లో పని చేసే సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారని ఫీడింగ్‌ అమెరికా సంస్థ తెలిపింది.