Hunger Deaths : దేశంలో ఆకలి చావులు ఉండకూడదు..ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు

 దేశంలో ఇకపై ఆకలి చావులు ఉండకూడదు..ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత..కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది

Hunger Deaths : దేశంలో ఆకలి చావులు ఉండకూడదు..ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు

Hunger Deaths Supreme Court

SC Clear That Hunger Deaths Not Occur In The Country : దేశంలో ఇకపై ఆకలి చావులు అనేవి ఉండకూడదని..ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత అని..కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి వెంటనే రిపోర్టు ఇవ్వాలని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇకనుంచి దేశంలో ఆకలి చావు అనేమాట ఉండకూడదని దీని కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు అనుసరిస్తుందో వెంటనే తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది.

ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత..కమ్యూనిటీ కిచెన్లపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేయాలని సూచించింది. దీనిపై ఇక ఉపేక్షణ అనేది ఉండరాదని స్పష్టంచేస్తు ఇదే కేంద్రానికి చివరి అవకాశమని..ఆకలి చావుల్ని శాశ్వతంగా నిర్మూలించటానికి దేశవ్యాప్త ప్రణాళిక అయి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని కోసం కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సీజేఐ నేతత్వంలోని జస్టిస్ బోపన్న, హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అటార్నీ జనరల్ కేకే వేణఉగోపాలకు సూచించింది.ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలను గుర్తించి..వారి సమస్యలు తీర్చాలని సూచించింది.

Read more : న్యూయార్క్ లో ఒక్కపూట తిండి కోసం అల్లాడుతున్న 20లక్షలమంది: అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

సామాజిక వేత్తలు అనున్‌ ధావన్, ఇషాన్‌ ధావన్, కుంజన సింగ్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం (నవంబర్ 16,2021) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం ముందుకొచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ సంపూర్ణంగా దాఖలు చేయడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

కోర్టు ఒకటి చెబితే మరొకటి అఫిడవిట్‌లో ఉంటోందని పేర్కొంది. ‘‘ఆకలి విషయంలో కేంద్రం శ్రద్ధ చూపుతానంటే రాజ్యాంగం, చట్టాలు అడ్డుచెప్పవు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలవుతోంది. చివరి అవకాశంగా రెండు వారాల్లో సమావేశం నిర్వహించండి’ దీనిపై తుది ప్రణాళిక రూపొందించి మూడు వారాల్లోగా కోర్టుకు సమర్పిచాలని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. ఆకలితో అల్లాడేవారు నివసించే ప్రాంతాలను గుర్తించి ‘కమ్యూనిటీ వంటగది పథకం అక్కడ అమలు చేయమని సూచించారు.

Readmore : Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..

కాగా దేశంలోని పలు రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్‌లను నడుపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పిల్లలు, పాలిచ్చే తల్లుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కానీ సాధారణ ప్రజల కోసం జాతీయ స్థాయిలో కమ్యూనిటీ కిచెన్‌లు లేవు. కరోనా మహమ్మారి తరువాత దేశంలో ఆకలి సమస్యలు మరింతగా పెరిగాయి. లాక్‌డౌన్ తో ఉపాధులు కోల్పోయి ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరిగింది. చాలా ప్రాంతాలలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో కుటుంబ ఆదాయాలు తగ్గాయి.

Read more : Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

దేశవ్యాప్తంగా ఆకలి సమస్యను తీర్చేందుకు పాన్ ఇండియా కమ్యూనిటీ కిచెన్‌ల కోసం పిటిషనర్లు అనున్ ధావన్, ఇషాన్ ధావన్ మరియు కుంజనా సింగ్ కోర్టును కోరారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని..అయితే పని వేగం అసంతృప్తికరంగా ఉందని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తరఫున హాజరైన ఏఎస్‌జీ మాధవి దివాన్ అన్నారు. ఈక్రమంలో కేంద్రానికి పలు సూచనలు చేసని సందర్భంగా జస్టిస్ కోహ్లి మాట్లాడుతు..‘మేము ప్రాసెంటీ గురించి మాట్లాడుతున్నాము..మీరు భవిష్యత్తులో మాట్లాడుతున్నారు” అని అన్నారు.