Bandla Ganesh: చేతులెత్తి నమస్కరిస్తాను.. నన్ను ఇబ్బంది పెట్టకండి.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం(Bandla Ganesh) అవసరంలేదు. ఒకప్పుడు కమెడియన్ గా ప్రస్థానం సాగించిన బండ్ల గణేష్ రీసెంట్ గా నిర్మాతగా మారాడు.
Producer Bandla Ganesh posts shocking post on rumors against him
Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ఒకప్పుడు కమెడియన్ గా ప్రస్థానం సాగించిన బండ్ల గణేష్ రీసెంట్ గా నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించింది. (Bandla Ganesh)ఈ ఒక్క సినిమాతో ఆయన స్టార్ నిర్మాతల లిస్టులోకి చేరిపోయాడు. ఈ సినిమా తరువాత కూడా ఆయన చాలా భారీ సినిమాలు చేశాడు. కానీ, ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ తరువాత అయన సినిమాలు చేయడం ఆపేశాడు. ఆ తరువాత రాజకీయాల పరంగా బిజీ అయ్యాడు.
Nuveksha: బ్లాక్ శారీలో కేకపెట్టించే అందం.. నువేక్ష గ్లామర్ షో పీక్స్.. ఫోటోలు
ఇక బండ్ల గణేష్ సినిమా ఈవెంట్ లలో ఇచ్చే స్పీచ్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరో ఎవరైనా కానివ్వండి ఆయన తన మాటలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. తాజాగా ఆయన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పై ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన కె -ర్యాంప్ మూవీ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరంను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక నిన్ను ఎవరు ఆపలేరు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆలాగే, తాను బ్లాక్ బస్టర్ సినిమాతో సినిమాలు చేయడం ఆపేశానని, త్వరలోనే మళ్ళీ నిర్మాతగా మారి సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు.
దీంతో, సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. బండ్ల గణేష్ ఈ హీరోతో సినిమా చేస్తున్నాడు అని, ఒక స్టార్ హీరో డేట్స్ కూడా ఇచ్చాడని, అందుకే అలా ఓపెన్ కామెంట్స్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బండ్ల గణేష్ వరకు చేరడంతో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. “మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. ఇంకా సినిమాలు చేయడం పై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి, ఇలాంటి వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ.. విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్” అంటూ రాసుకొచ్చాడు. దీంతో బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:
ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.
దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి
చేతులెత్తి నమస్కరిస్తూ…— BANDLA GANESH. (@ganeshbandla) November 4, 2025
