SIP Calculator : పెట్టుబడి పెట్టేవారికి గుడ్‌న్యూస్.. SIPలో నెలకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా రూ. 10 లక్షలు సంపాదించుకోవచ్చు!

SIP Calculator : ఎస్ఐపీలో పెట్టుబడి పెడుతున్నారా? ఎస్ఐపీలో నెలకు రూ. 100 పెట్టుబడి పెడితే ఎన్ని ఏళ్లలో ఎన్ని లక్షలు అవుతుందంటే?

SIP Calculator : పెట్టుబడి పెట్టేవారికి గుడ్‌న్యూస్.. SIPలో నెలకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా రూ. 10 లక్షలు సంపాదించుకోవచ్చు!

SIP Calculator

Updated On : November 4, 2025 / 8:06 PM IST

SIP Calculator : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెట్టాలో అర్థం కావడం లేదా? అయితే, ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. అందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) అద్భుతంగా ఉంటుంది. ప్రారంభంలో పెట్టుబడితో భవిష్యత్తులో భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ చాలా అవసరం. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామందికి లక్షాధికారి కావాలనే కల అలాగే ఉండిపోతుంది.

అయితే, ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా (SIP Calculator)ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టడమే. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా కేవలం రూ. 100తో నెలవారీగా పెట్టుబడి పెట్టవచ్చు. దాంతో కాలక్రమేణా భారీగా సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఎస్ఐపీలో ఎంత మొత్తంలో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది? నెలకు రూ. 100 పెట్టుబడి పెడితే ఎన్ని ఏళ్లలో ఒక మిలియన్ (రూ. 10 లక్షలు) సంపాదించుకోవచ్చు అనేది ఎస్ఐపీ క్యాలిక్యూలేటర్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..

నెలకు రూ.100 SIPతో రాబడి ఎంత? :
ఎస్ఐపీలో పెట్టుబడి క్రమంగా పెరుగుతుంది. ప్రారంభంలో కనీస పెట్టుబడితో మొదలై అలా ఏళ్ల తరబడి కొనసాగిస్తే ఊహించని లాభాలను పొందవచ్చు. రూ. 100 చిన్న మొత్తంలో పెట్టుబడి ఏళ్ల తరబడి పెడితే కూడా భారీ మొత్తంలో డబ్బులను కూడబెట్టుకోవచ్చు. ఉదాహరణకు.. ఒకరు నెలకు రూ.100 చొప్పున 25 ఏళ్లు 12శాతం వార్షిక రాబడితో పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.1,40,221 వడ్డీని సంపాదించుకోవచ్చు. మొత్తం రాబడి రూ.1,70,221 అవుతుంది. క్రమశిక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు

Read Also : Motorola G67 Power : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా G67 పవర్ వచ్చేస్తోందోచ్.. ఏఐ కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంత ఉండొచ్చంటే?

SIP కాంపౌండింగ్ ఫార్ములా ప్రకారమే.. :
ఎస్ఐపీ కాంపౌండింగ్ ఫార్మూలా ప్రకారం.. ఒకరి నెలవారీ స్థిర మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కాలక్రమేణా ఈ చిన్న మొత్తాలు భారీ మొత్తంలో రాబడిగా మారతాయి. ఉదాహరణకు.. ఎవరైనా ఒకరు 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.100 చొప్పున పెట్టుబడి పెడితే.. వారి మొత్తం పెట్టుబడి రూ.30వేలు, 12శాతం వార్షిక రాబడితో దాదాపు రూ.1,89,000 వరకు పెరుగుతుంది. రాబడి రేటు 10శాతం అయినా ఫండ్ సుమారుగా రూ. 1,18,000కు పెరుగుతుంది. 14శాతం రాబడితో దాదాపు రూ. 2,92,000 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడితో అధిక రాబడి :
సాధారణంగా పెట్టుబడి విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు భారీగా లాభాలను అందిస్తాయి. ఎందుకంటే.. ఇందులో చక్రవడ్డీ క్రమంగా రాబడిని పెంచుతుంది. రూ. 100తో పెట్టుబబడి ప్రారంభించి క్రమంగా నెలవారీ మొత్తాన్ని రూ. 500 లేదా రూ. 1,000కు పెంచుకోవచ్చు. ఇలా చేస్తే కేవలం 10ఏళ్లు నుంచి 15 సంవత్సరాలలో లక్షల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.

మిగతా పెట్టుబడులతో పోలిస్తే ఎస్ఐపీ ప్లాన్లు మార్కెట్ రిస్క్‌లతో ముడిపడి ఉంటాయి. అయితే, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేవారికి ఈ రిస్క్‌లు కూడా క్రమంగా తగ్గుతాయి. ఊహించిన రాబడిని రాబట్టుకోవచ్చు. ఎప్పుడైనా స్థిరమైన పెట్టుబడి అనేది కాలం గడిచేకొద్దీ పెరుగుతుంది. అదే చిన్న పెట్టుబడులను భారీ మొత్తంలో సంపాదించుకోవచ్చు.