Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

పిల్లల ఆకలి తీర్చడానికి ఓ తల్లి పసిబిడ్డను అమ్మకానికి పెట్టింది. తినటానికి తిండి లేదు. చంటిబిడ్డ ఆకలి కూడా తీర్చలేని దుర్భర పరిస్థితులు అప్ఘానిస్థాన్ లోని దుస్థితికి నిదర్శనం.

Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

Afghan Baby Girl Sell for 500 Dollars : కన్నతల్లికి కడుపున పుట్టిన పిల్లలందరు సమానమే.కానీ కరవు రక్కసికి తెలియదు కదా..బిడ్డలు ఆకలితో అల్లాడితే ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోతుందని..ఆఫ్ఘాన్ లో కరడుకట్టిన తాలిబన్లకు తెలియదు కదా ఓతల్లి గుండె రంపపు కోత. ఆఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్నాక వినోదాల్లో..విలాసాల్లో తేలిపోతున్న తాలిబ్లకు ఏం పడుతుంది బిడ్డల ఆకలి తీర్చలేక ఓ కన్నతల్లి తన నాలుగో సంతానాన్ని అంగడిసరుకుగా అమ్ముకోవాల్సిన దుస్థితుల గురించి. ఓ పక్క బిడ్డలు ఆకలితో అల్లాడుతున్న దుస్థితి.మరోపక్క బుక్కెడు బువ్వ కూడా లేని కడుదయనీయ పరిస్థితి. దీంతో మిగిలిని ముగ్గురు పిల్లల కడుపు నింపటానికి ఆ తల్లి తన చంటిబిడ్డను అమ్మకానికి పెట్టిన దారుణ పరిస్థితులు అఫ్ఘానిస్థాన్ పరిస్థితులకు అద్దంపడుతోంది.

అది అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఓ కుగ్రామం. అక్కడ నివసించే ఓ తల్లికి నలుగురు పిల్లలు. ఆకలితో కుటుంబం అంతా అల్లాడుతోంది. నాలుగో బిడ్డ నెలల పసికందు పసిగుడ్డు. పేదవారైనా గత కొంతకాలం క్రితం వరకు వారికి ఏ లోటు లేదు. కడుపునిండా తిండి ఉండేది. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిగుడ్డుకు పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ తల్లి గుండె రాయి చేసుకుంది. అమ్మ మనసును చంపుకుంది.

Read more :  Afghanistan : అప్ఘానిస్తాన్‌లో ఆకలి కేకలు : విరాళాలపై బతుకీడుస్తున్న అప్ఘాన్లు..!

మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును 500 డాలర్లకు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.38వేలు. ఆ తల్లి అమ్మే బిడ్డను ఓ వ్యక్తి కొనటానికి ముందుకొచ్చాడు. ఎందుకంటే ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయటానికి. అఫ్ఘాన్ లో ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది.

అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో అమ్మకానికి పెట్టిన చిన్నారి చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించకునేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి కష్టమైపోయింది. చేయటానికి పనిలేదు. ఈ పరిస్థితుల్లో ఆఖరి బిడ్డ చంటిబిడ్డను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు.

ఈ దారుణ దుస్థితి గురించి ఆ తల్లి గుండెలవిసేలా ఏడుస్తు ఏమంటోందంటే..‘‘మాకు నలుగురు పిల్లలు. ఆఖరిది చంపపాప. పాలు కూడా పట్టలేని దుస్థితి. ఆకలితో ఏడుస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాం. చంటిబిడ్డతో సహా ఇంట్లో అందరం ఆకలితో అలమటిస్తున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాని దారుణదుస్థితి. అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చిందని వేదన చెందుతోంది.

Read more : North Korea: ఆహార సంక్షోభం.. కిలో అరటి పండ్లు రూ.3,400!

చంటిబిడ్డ కాబట్టి దానికేమీ తెలియదు. తన తల్లే తనను అమ్మేసిందని ఆ పాప పెరిగి పెద్ద అయ్యక తెలవచ్చు. అప్పుడు ఆ బిడ్డ తనను తప్పకుండా అసహ్యించకుంటుంది. ఇంతటి దారుణ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. కానీ మిగతాబిడ్డల ఆకలి తీర్చటానికి నాకు వేరే దారిలేదు. అన్ని రకాలుగా చచ్చిపోయిన ఇలా చేయాల్సి వస్తోందని..బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మా పరిస్థితులు మాతో ఇలా చేయిస్తున్నాయంటూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తు తెలిపింది.