North Korea: ఆహార సంక్షోభం.. కిలో అరటి పండ్లు రూ.3,400!

ఉత్తర కొరియాకు ప్రపంచంలో ఏ దేశానికి రాని పెద్ద కష్టమొచ్చి పడింది. దేశంలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. గతేడాది దేశాన్ని కుదిపేసిన తీవ్ర తుపానులు, కరోనా మహమ్మారి వ్యాప్తి తదితర అంశాలతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.

North Korea: ఆహార సంక్షోభం.. కిలో అరటి పండ్లు రూ.3,400!

North Korea (1)

North Korea: ఉత్తర కొరియాకు ప్రపంచంలో ఏ దేశానికి రాని పెద్ద కష్టమొచ్చి పడింది. దేశంలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. గతేడాది దేశాన్ని కుదిపేసిన తీవ్ర తుపానులు, కరోనా మహమ్మారి వ్యాప్తి తదితర అంశాలతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియా ఆదాయం కొంత మేర పెరిగినా… ఆహార ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు అమలు చేయడంతో ఇక్కడ ఆహార నిల్వలు అడుగంటిపోయాయి.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిలో అరటి పండ్లు 46 డాలర్లు పలుకుతున్నాయి. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3600 అనమాట. ఆహారం, చమురు, ఎరువులు వంటి వాటి కోసం ఉత్తరకొరియా చైనా పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే, చైనాతో సరిహద్దులు మూసేయడంతో ఆ దేశం నుండి దిగుమతులు తగ్గపోయి ఆహార కోరతా ఏర్పడింది. ఇదే సమయంలో దేశంలోని ఆహార నిల్వలు ఘణనీయంగా తగ్గిపోయాయి. దీనిపై ఇప్పటికే అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పార్టీ కేంద్ర కమిటీతో సమావేశమై దీనిపై చర్చించారు.

దేశం ఆహార కొరత నుంచి బయటపడే మార్గం కనుగొనాలని పార్టీ నేతలను, అధికారులను కోరారు. పరిస్థితులు దిగజారకముందే వ్యవసాయ ఉత్పత్తులను పెంచే మార్గాలను కనుగొనాలని కిమ్ సూచించారు. దేశంలో ప్రధాన సంస్కరణల అమలు, ఆర్థిక సంక్షోభం నివారణకు చర్యలు తదితర అంశాలపై కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షతన అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇప్పటికే సమావేశమై చర్చించింది. ప్రజలు కూడా కొన్ని ఆంక్షలు ఎదుర్కొనడానికి సిద్ధపడాలని ఇప్పటికే కిమ్ పిలుపునిచ్చారు.