Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..

అఫ్గాన్ లో ఆకలి కేకలు. అంగట్లో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్న దుస్థితికి దారి తీస్తోంది. పెళ్లి పేరుతో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్నారు.

Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..

Father Sells 9 Years Daughter To ‘keep Family Alive

Father sells 9 years daughter to ‘keep family alive : అఫ్ఘానిస్థాన్. తాలిబన్లు వశపరుచుకున్నాక అక్కడి ఆడపిల్లల బతుకులు అత్యంత దుర్భరంగా మారిపోయాయి. ఓ పక్క తాలిబన్లు ఆడపిల్లలు స్కూళ్లకు వెళ్లకూడదు. యువతులు క్రీడల్లో పాల్గొనకూడదు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. ఇంటికే పరిమితంగా ఉండాలని ఒక్కమాటలో చెప్పాలంటే బానిసల్లా పడి ఉండాలని హుంకరిస్తున్నారు. మరోపక్క కన్నవారే ఆడపిల్లల్ని అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. మరోపక్క బాల్య వివాహాల పేరుతో ఆడపిల్లల్ని కూరగాయల్లా అమ్మేస్తున్న దారుణ పరిస్థితులకు పసిబాలికల బతుకులు బాల్యంలోనే చిదిమివేయబడుతున్నాయి. కన్నవారే కసాయివారుగా మారి ఆడపిల్లల్ని వారికంటే మూడు నాలుగు రెట్లు వయస్సున్నవారికి అమ్మేస్తున్నారు.

అటువంటి పరిస్థితులకు పర్వానా మాలిక్‌ అనే తొమ్మిదేళ్ల బాలిక బతుకు బుగ్గిపాలైపోయింది. చదువుకోవాలనే ఆమె కల కల్లగానే మిగిలిపోయింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను చిదిమేశాయి. కూటికి కూడా గతిలేని ఆ ఇంటి పేదరికం ఆ తొమ్మిదేళ్ల పసిపాపను పెళ్లి పేరుతో దారుణ దుస్థితికి నెట్టేసింది. తొమ్మిదేళ్ల ఆ పసిపాపకు 55ఏళ్ల వ్యక్తికి ఇల్లాలిని చేసింది. ఒక్క పూట తిండికూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పర్వానా తండ్రి..కుటుంబాన్ని బతికించుకోవడం కోసం తన 9ఏళ్ల కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మకానికి పెట్టారు. ఇలా ఒక్క పర్వానానే పరిస్థితే కాదు.. అఫ్గానిస్థాన్ లో ఎంతోమంది బాలికల పరిస్థితి ఇలాగే ఉంది.

Read more : Afghan..‘Just give us our money’: ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి : తాలిబన్లు

ఈ పరిస్థితి దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక మరింత దారుణంగా తయారైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అఫ్గానిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రజల ఆకలికేకలు తాలిబన్ల కర్కశత్వానికి నిదర్శనంగా వినిపిస్తున్నాయి. కనిపిస్తుననాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. డబ్బులేక..చేయటానికి పనిలేక..వేలాది కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయి. బుక్కెడు తిండి కోసం కన్నబిడ్డల్నే కసాయివారిలా అమ్మేసుకుంటున్నారు. అంగట్లో వస్తువుల్లా ఆడపిల్లల్ని తెగనమ్మేసుకుంటున్నారు. తండ్రులు తమ చిన్నారి చిట్టితల్లుల్ని పెళ్లి పేరుతో విక్రయించి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబానికి తిండిపెడుతున్నారు. ఈ తిండి కూడా ఎంతకాలం వస్తుందో తెలియదు. అలా మరోసారి ఆకలిబారిన పడితే మరో బిడ్డను కూడా అమ్మేస్తారు. ఇది అక్కడ ఆడపిల్లగా పుట్టిన పాపానికి పడుతున్న కష్టాలు.

బాద్ఘీస్‌ ప్రావిన్స్‌కు చెందిన అబ్దుల్‌ మాలిక్‌కు కూడా ఉపాధి లేకపోవడంతో తన 8 మంది కుటుంబసభ్యులను పోషించడం కష్టంగా మారింది. దీంతో రెండు నెలల క్రితం తన 12 ఏళ్ల కుమార్తెను ఓ పెద్ద వయసు వ్యక్తికి ఇచ్చి పెళ్లి కింద అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో రెండు నెలలు నెట్టుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. దీంతో చేసేదేం లేక, తన 9ఏళ్ల మరో కుమార్తె పర్వానాను 55ఏళ్ల ఖూర్బాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇందుకు బదులుగా ఖూర్బాన్‌.. మాలిక్‌ కుటుంబానికి గొర్రెలు, డబ్బు రూపంలో 2లక్షల అఫ్గానీలను చెల్లించాడు.

Read more : Afghan..‘Just give us our money’: ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి : తాలిబన్లు

తొమ్మిదేళ్ల పర్వానాకు చదువుకోవాలని ఆశ. టీచర్ అయి తన కుటుంబానికి అండగా ఉండాలని ఆశపడింది. కానీ కుటుంబ పరిస్థితులు తననే తెగనమ్మేలా తయారయ్యాయి. తండ్రి మాటను ఒప్పుకోక తప్పలేదు ఆ చిన్నారి. చిన్ననాటే తండ్రిమాటకు ఎదురు చెప్పకుండా 55ఏళ్ల వ్యక్తికి భార్యగా మారాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఆ చిన్నపిల్లలకు పెళ్లి అనేమాటకు అర్థం కూడా తెలీదు.

పెళ్లి అంటే ఏంటో తెలియకపోయినా పర్వానా..భోరున ఏడుస్తు తన కుటుంబాన్ని వదిలి ఖూర్బానాతో వెళ్లిపోయింది. కానీ తనబిడ్డను అమ్ముకున్నందుకు సిగ్గుగా ఉన్నా కుటుంబాన్ని బతికించుకోవటానికి తప్పలేదంటున్నాడు తండ్రి మాలిక్‌. అలాగే మరో ఘటనలో 10ఏళ్ల మగుల్‌ అనే బాలికను తండ్రి డబ్బు కోసం 70ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వానా, మగుల్‌ మాత్రమే కాదు.. దాదాపు ప్రతి అఫ్గాన్‌ బాలికల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది.

Read more :  Afghanistan : అప్ఘానిస్తాన్‌లో ఆకలి కేకలు : విరాళాలపై బతుకీడుస్తున్న అప్ఘాన్లు..!

అప్ఘాన్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఓ తండ్రి తన నలుగురు పిల్లల్లో నెలల ఆడపసి గుడ్డును అమ్మేశాడు.   మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును 500 డాలర్లకు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.38వేలు అమ్మేశాడు. ఆ బిడ్డను ఓ వ్యక్తి కొనటానికి ముందుకొచ్చాడు. ఎందుకంటే ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయటానికి. అఫ్ఘాన్ లో ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. అంటే ఏదో వస్తువుని కొని ఇంట్లో అవసరానికి ఉపయోగపడుతుందని కొని పెట్టుకున్నట్లుగా ఉంది. ఇంతకంటే ఆడపిల్లల విషయంలో దారుణ పరిస్థితులు ఇంకేముంటాయి? అనిపిస్తోంది ఇటువంటి ఘటనలు జరుగుతుంటే..