Afghan..‘Just give us our money’: ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి : తాలిబన్లు

ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి అంటన్నారు తాలిబన్లు. వివిధ దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్లు అడుగుతున్నారు.

Afghan..‘Just give us our money’: ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి : తాలిబన్లు

Afghan Crisis ‘just Give Us Our Money

Afghan Crisis : ‘Just give us our money’: అఫ్ఘానిస్థాన్ ని తాలిబన్ల హస్తగతం చేసుకున్నాక అతి కొద్ది రోజుల్లోనే దేశంమంతా సంక్షోభం ఏర్పడింది.తినటానికి తిండి కూడా లేని దుస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు. తాలిబన్లకు కూడా కష్టంగా మారింది.దేశ ఖజానా ఖాళీ అయిపోవటంతో తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్లు ఆయా దేశాల్లోని బ్యాంకులను డిమాండ్ చేస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో నిల్వచేశాయి. ఆ డబ్బుని ఇప్పుడు తమకు ఇవ్వాలని మా దేశం పరిస్థితులు ఏమీ బాగాలేదని కాబట్టి ఆ బ్యాంకుల్లో ఉన్న మా డబ్బుని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక..ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా పేద కుటుంబ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కన్నబిడ్డల్ని కూడా అమ్ముకుంటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి. ఓ పక్క కరవు తాండవిస్తుంటే తాలిబన్లు మాత్రంత తమదైన శైలిలో తమకు ఎదురుతిరిగినా..తమ మాట ఖాతరు చేయకపోయినా..గతంతో తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. క్రూరమైన శిక్షలు, పాశవిక పాలనతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో ప్రజలు భయంతోనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నిమిషాలు యుగాల్లో గడుపుతున్నారు.

Read more : Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

మరోపక్క ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. దీంతో తాలిబన్లు మారిపోయామని నమ్మిస్తు భారీగా విరాళాలు సేకరించారు. కానీ అవిమాత్రం ఎంతకాలం ఉంటాయి. అవికూడా కరిగిపోయాయి. మరోపక్క ఎగుమతులు, దిగుమతులు కూడా నిలిచిపోయాయి. పొరుగు దేశాలతో ఎగుమతి,దిగుమతులు అత్యంత కష్టసాధ్యంగా మారాయి. ప్రస్తుతం అప్ఘాన్ఉన్న పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు పెట్టటానికి ఎవ్వరు సాహసించటంలేదు. సరుకుల రవాణాలు కూడా ఆగిపోయాయి.

ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో తాలిబన్ల దృష్టి గత ప్రభుత్వం పలు దేశాల్లో దాచిన డబ్బులపై పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్లు కోరుతున్నారు. తాలిబన్లు కోరుతున్నారు అనేకంటే డిమాండ్ చేస్తున్నరని అనటం సరైంది. ఎందుకంటే తాలిబన్ల స్టైల్ అటువంటిదే. అఫ్ఘానిస్థాన్ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో నిల్వచేసిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నారు.

Read more :  Afghanistan : అప్ఘానిస్తాన్‌లో ఆకలి కేకలు : విరాళాలపై బతుకీడుస్తున్న అప్ఘాన్లు..!

గతఆగస్టులో ఇస్లామిస్ట్ తాలిబాన్ పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటినుంచి ఆయా దేశ ప్రభుత్వాలు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా నిలిపివేశాయి. దీంతో తాలిబన్లు వాటిని స్వాధీనం చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. మా దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేదనీ..కాబట్టి ఆ బ్యాంకుల్లో డబ్బుని తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ నాయకులు బ్యాంకులను అడుగుతున్నారు.

బ్యాంకుల్లో ఉన్న డబ్బుని తిరిగి ఇవ్వాలనే విషయంపై అఫ్ఘాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఆ డబ్బు అఫ్గనిస్తాన్‌ దేశానిది. మా డబ్బు మాకివ్వండి. నగదు నిలుపుదల చేయడం సరికాదని..అలా చేయటం అంతర్జాతీయ చట్టాలు, విలువలకు విరుద్ధం. ’’ అని అన్నారు. మా ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని..మానవత్వంతో చేసే పనులకు సహకరించాలని కోరుతు బ్యాంకుల్లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు.

Read more : North Korea: ఆహార సంక్షోభం.. కిలో అరటి పండ్లు రూ.3,400!

దీనిపై ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డు సభ్యుడు షా మెహ్రాబీ మాట్లాడుతు..దేశంలో పరిస్థితులు అస్సలు బాగాలేదు. నగదు మొత్తం కరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితులకు తగినంతగా ఉందికానీ..అది ఈ సంవత్సరం చివరి వరకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు అఫ్ఘాన్ నుంచి యూరప్ దేశాలకు వలసలు పోతారని..ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఆఫ్ఘానిస్తాన్‌కు ప్రతి నెలా $150 మిలియన్లు అవసరమని మెహ్రాబీ తెలిపారు.