4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..

ఫారోల దేశంలో 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం బయటపడింది.

4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..

4500 Year Old Sun Temple

4500 Year Old Sun Temple : ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి పిరమిడ్లు.అంతేకాదు ప్రపంచదేశాలలో సుదీర్ఘ చరిత్రకలిగిన దేశాలలో ఈజిప్టు కూడా ఒకటి. ఈజిప్ట్ లో ఫెరోల సామ్రాజ్య స్థాపన 5వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అటువంటి ఈజిప్టు దేశంలో చేపట్టిన తవ్వకాల్లో 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాల‌యం బయటపడింది. ఇస్లాం, క్రిష్టియానిటీ ఎక్కువగా ఉండే ఈజిస్టులో 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయం బయటపడటం విశేషమనే చెప్పాలి. తవ్వకాల్లో సూర్యదేవాలయం బయటపడింది అని ఈజిప్ట్‌ పురావ‌స్తుశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ దేవాలయం 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన దేవాలయమని అధికారులు భావిస్తున్నారు.

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

కాగా ఈజిప్ట్‌ను ఒక‌ప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. ఐదు వేల ఏళ్ల క్రితమే ఫారోల రాజ్యం ప్రారంభమైంది ఈజిప్టులో. ఫారోల హ‌యాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది. దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇప్పుడు బయటపడ్డ ఈ ఆలయం కూడా ఒకటని తెలిపారు. దాన్ని మేం తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని తెలిపారు. అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఈ పరిశోధకుల బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని..గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు.

Read more : తవ్వకాల్లో బయటపడిన 2వేల ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారపు నాలుక..!షాక్ అయిన పురావస్తుశాస్త్రవేత్తలు..!!

ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉందని పరిశోధకులు గుర్తించారు. 1898 లో ఒక‌సారి సూర్య‌దేవాల‌యాన్ని అధికారులు క‌నిపెట్ట‌గా.. తాజాగా రెండో సూర్య‌దేవాల‌యాన్ని గుర్తించారు. మరి మరో నాలుగు దేవాలయాల విషయంపై కూడా పరిశోధకులు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మరి ఆ నాలుగు దేవాలయాలు వారి పరిశోధనల్లో త్వరలో బయటపడనున్నాయేమో వేచి చూడాలి.

Read more : Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?