Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?

అప్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టే.. అక్కడి పురాతన ఖజానా బ్యాక్టియాన్ ఖజానా తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారా? ఇప్పుడు ఇదే అందోళన పురావస్తు ప్రేమికుల్లో వ్యక్తమవుతోంది.

Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?

What Happens To Afghanistan’s Gold Reserves

Afghanistan Gold Reserves : అప్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టే.. అక్కడి పురాతన ఖజానా బ్యాక్టియాన్ ఖజానా తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారా? ఇప్పుడు ఇదే అందోళన పురావస్తు ప్రేమికుల్లో వ్యక్తమవుతోంది. అప్ఘాన్ సంబంధిత అనేక ప్రాంతాలను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. పలు దేశాల్లో అప్ఘాన్ రిజర్వులు, బంగారాన్ని కూడా అక్కడి దేశాలు స్తంభింపచేశాయి. అత్యంత పురాతన స్వర్ణ నిధిగా పేరుగాంచిన బ్యాక్ట్రియన్ ఖజానా ఒకటి తాలిబన్ల రాజ్యంలో ఉండిపోయింది. అప్ఘాన్ నుంచి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అప్ఘాన్ కేంద్ర బ్యాంక్ ఆధీనంలో ఈ ఖజానా ఉంది. ఇప్పుడు ఈ ఖజానాపై కన్నేసిన తాలిబన్లు ఏం చేస్తారోనన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.

సోవియట్ యూనియన్ ఆక్రమణకు కొన్ని యేళ్ల ముందు సోవియట్-అప్ఘాన్ పురావస్తు పరిశోధన బృందం ఉత్తర అఫ్గాన్‌లోని గోల్డెన్ హిల్ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. గ్రీక్-రష్యన్ పురావస్తు శాస్త్రవేత్త విక్టోర్ సరియాందీ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. అప్పుడు అక్కడ ఒక భారీ ఖజానా బయటపడింది. అందులో 20,600 వస్తువులు బయటపడ్డాయి. బంగారు ఆభరణాలు, నాణేలు, బొమ్మలు, వస్తువులు ఉన్నాయి. ఆరు సమాధులను గుర్తించారు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందినవిగా చెబుతున్నారు. భారత్‌లో ఏనుగు దంతాలతో తయారైన కళాఖండాలు కూడా బయటపడ్డాయి. పురావస్తు సంపదకు గనిలాంటిదిగా చెబుతున్నారు. నాల్గో శతాబ్దంలోఅలెగ్జాండర్ ది గ్రేట్ బ్యాక్ట్రియన్ ఖజానాను ఆక్రమించాడు. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంతం పలు దండయాత్రలు జరిగాయి. పలు సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు అందులో కనిపిస్తున్నాయి.
Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!

ఆక్రమించుకున్న ఖజానాను కాబుల్‌లోని నేషనల్ మ్యూజియానికి చేర్చారు. అప్పుడే సోవియట్ దురాక్రమణకు గురైంది. అప్పటి నుంచి ఈ మ్యూజియంపై అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు. ఇక్కడి ఖజనాలో 70శాతం సంపద దోపిడీకి గురైంది. బ్యాక్ట్రియన్ నిధి వస్తువులు కూడా అపహరణకు గురయ్యాయి. 1988లో అప్ఘాన్ నుంచి సోవియట్ విరమించుకుంది. అప్పుడే నజీబుల్లా ప్రభుత్వం మ్యూజియంలో బ్యాక్ట్రియన్ ఖజానాకు భద్రత ఉండదని భావించింది. పేర్కొంది. మ్యూజియం డైరెక్టర్ ఒమర్ ఖాన్ మసూదీ ఈ ఖజానాను భద్రపర్చినట్లు వెల్లడించింది. ఈ నిధి తెరవాలంటే ఐదు తాళాలు కావాలంట.. ఒమర్ వద్ద ఒక తాళం ఉందని, మిగిలిన తాళాలు వేర్వేరు వ్యక్తుల వద్ద ఉన్నాయి. అఫ్గాన్ ముఠా నేతలు, తాలిబన్లకు దక్కకుండా ఆ తాళాలను రక్షించారు. 1996లో అధికారం చేపట్టిన తాలిబన్లకు ఈ విషయం తెలియదు.

ఒకవేళ తాళం కలిగిన వ్యక్తి మరణిస్తే.. అతడి సంతానంలో పెద్దవారికి అందచేయాల్సి ఉంటుంది. 2003లో అమెరికా తాలిబన్లను పూర్తిగా తరిమికొట్టేసింది. అప్పుడు ఈ నిధి సురక్షితంగానే ఉందని పౌర ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఖజానా విషయం బయటకు తెలిసిన తర్వాత అక్కడి ప్రభుత్వం 2006 నుంచి 13 సార్లు విదేశాల్లో ప్రదర్శనల్లో ఉంచింది. పారిస్‌లో ఈ ఖజానాను తొలిసారి ప్రదర్శించారు. చివరిసారిగా 2020లో హాంకాంగ్‌లో ప్రదర్శనకు ఉంచారు. తద్వారా అప్ఘాన్ ప్రభుత్వానికి 4.5 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అప్ఘానిస్తాన్‌లో అవినీతితో బ్యాక్ట్రియన్ ఖజానాకు ముప్పుగా మారుతుందని పార్లమెంట్‌లోనూ ఆందోళన వ్యక్తమైంది. వారసత్వ సంపద తాలిబన్ల చెరలోకి వెళ్లింది. ఇప్పటివరకూ తాలిబన్లకు అది కంటపడలేదు. ఒకవేళ వారికి తెలిస్తే.. ఆ ఖజానాను ఏం చేస్తారోనన్న ఆందోళన కనిపిస్తోంది.