PM Modi: అమెరికాకు మోదీ..! ట్రంప్ తోనే తేల్చుకుంటారా? టారిఫ్ తగవు ముగుస్తుందా?

PM Modi: అమెరికాకు మోదీ..! ట్రంప్ తోనే తేల్చుకుంటారా? టారిఫ్ తగవు ముగుస్తుందా?

PM Modi Donald Trump

Updated On : August 14, 2025 / 1:39 AM IST

PM Modi: సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ ముఖాముఖి తేల్చుకోబోతున్నారా? తొందరలోనే ఈ టారిఫ్ వార్ కి బ్రేక్ వేయబోతున్నారా? అవుననే అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ లో జరిగి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న ప్రధాని మోదీ అక్కడే ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. ఫేస్ టు ఫేస్ జరిగే ఈ మీట్ లోనే టారిఫ్ వ్యవహారానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.

తీవ్రమైన వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికా వెళ్లబోతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందని జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తోనూ భేటీ ఉందంటున్నారు. ఇక్కడే ఇద్దరి మధ్య సుంకాలు, వాణిజ్య బంధంపై కచ్చితంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

అసలు సుంకాల తగవుకి ప్రారంభానికి కారణమైన రష్యా-యుక్రెయిన్ యుద్ధంపైన కూడా ఈలోపున ఒక క్లారిటీ రానుంది. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ తో అలస్కాలో భేటీ అవుతున్నారు. అలానే ఈ నెలాఖరులో ప్రధాని మోదీ షాంఘై కోపరేషన్ సదస్సు కోసమని చైనా వెళ్తున్నారు. ఇక్కడే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం అవుతారు. ఈలోపున అన్నీ కుదిరితే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రావొచ్చు. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాస్కో వెళ్లి వచ్చారు.

మరోసారి విదేశాంగ మంత్రితో కలిసి రష్యా వెళ్లబోతున్నారు. ఇలా రష్యా అధ్యక్షుడ పుతిన్, తర్వాత చైనా అధినేత జిన్ పింగ్ తో భేటీ తర్వాత మోదీ ట్రంప్ ను కలవనున్నారు. మోదీ, ట్రంప్ భేటీలోనే రష్యా-యుక్రెయిన్ వార్ కి ఒక హేతుబద్ధకమైన ముగింపు దొరకొచ్చు. భారత ప్రయోజనాలే లక్ష్యంతో ట్రంప్ తో మోదీ చర్చలు జరుపుతారు.

Also Read: డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ వేళ.. కిమ్‌తో ఫోన్లో మాట్లాడిన పుతిన్.. ఏం జరుగుతుంది..? వీరిద్దరి మధ్య ఏఏ అంశాలపై సంభాషణ జరిగిందంటే…