Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..

ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ..

Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..

Allu Aravind

Updated On : August 14, 2025 / 7:16 PM IST

Allu Aravind : నేడు సైమా అవార్డులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే సైమా ఈవెంట్ అనౌన్స్ తో పాటు ఇటీవల నేషనల్ అవార్డులు గెలుచుకున్న తెలుగు వారిని పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు.

Also Read : Tollywood Anchors : టాలీవుడ్ యాంకర్స్ లో సిండికేట్ జరుగుతుందా? మొన్న ఉదయభాను, ఇవాళ సౌమ్య కామెంట్స్ వైరల్..

ఈ క్రమంలో ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగులో మనకు ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించి వాళ్ళందర్నీ ఒక స్టేజి మీదకు తీసుకొచ్చి సత్కరించడం హర్షించదగ్గ విషయం. మనకు ఏడు అవార్డులు వచ్చాయి. అందులో తెలుగు విభాగంలోనే కాక నేషనల్ వైడ్ అవార్డులు కూడా వచ్చాయి. దీన్ని ఒక పంగలా జరుపుకోవాలి కానీ ఇక్కడ సంగతి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also See : Sravanthi Chokarapu : ఇండిపెండెన్స్ డే.. ముందుగానే స్పెషల్ ఫొటోషూట్ చేసిన యాంకర్ స్రవంతి..