Tollywood Anchors : టాలీవుడ్ యాంకర్స్ లో సిండికేట్ జరుగుతుందా? మొన్న ఉదయభాను, ఇవాళ సౌమ్య కామెంట్స్ వైరల్..
మొన్న సీనియర్ యాంకర్ ఉదయభాను, తాజాగా కొత్త యాంకర్ సౌమ్య ఇలాంటి కామెంట్స్ చేయడంలో టాలీవుడ్ యాంకర్స్ సిండికేట్ గా ఏర్పడ్డారా అనే చర్చ జరుగుతుంది.

Tollywood Anchors
Tollywood Anchors : మొన్న ఉదయభాను, ఇవాళ సౌమ్య కామెంట్స్ టాలీవుడ్ లో చర్చగా మారాయి. ఇటీవల నటి, యాంకర్ ఉదయభాను ఓ ఈవెంట్లో.. ఇక్కడ యాంకర్స్ లో పెద్ద సిండికేట్ జరుగుతుంది. అన్ని ఛాన్సులు మాకు రావు. ఇక్కడ ఛాన్స్ రావాలంటే అదృష్టం ఉండాలి అని అంది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో నిజమే అంటూ ఆ వ్యాఖ్యలను సమర్ధించుకుంది ఉదయభాను.
దాంతో ఉదయభాను చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. టాలీవుడ్ యాంకర్స్ లో సిండికేట్ జరుగుతుందా? కొత్తవాళ్లను రానివ్వట్లేదా, కొంతమందే యాంకర్స్ గా ఉండాలని చూస్తున్నారా అని పెద్ద చర్చే జరిగింది. తాజాగా నటి, యాంకర్ సౌమ్య కూడా ఈ కామెంట్స్ చేసింది. పలు కన్నడ, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య జబర్దస్త్ లో, పలు టీవీ షోలలో యాంకర్ గా చేసింది.
Also Read : Sravanthi Chokarapu : ఇండిపెండెన్స్ డే.. ముందుగానే స్పెషల్ ఫొటోషూట్ చేసిన యాంకర్ స్రవంతి..
సౌమ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లాస్ట్ టైం ఉదయభాను గారు అన్నట్టు ఇక్కడ ఒక పెద్ద సిండికేట్ జరుగుతుంది. అది వంద శాతం ఉంది అని కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
మొన్న సీనియర్ యాంకర్ ఉదయభాను, తాజాగా కొత్త యాంకర్ సౌమ్య ఇలాంటి కామెంట్స్ చేయడంలో టాలీవుడ్ యాంకర్స్ సిండికేట్ గా ఏర్పడ్డారా అనే చర్చ జరుగుతుంది. దీనిపై ఎవరైనా యాక్టివ్ గా ఉన్న యాంకర్స్ స్పందిస్తారేమో చూడాలి.