Vitamin K1 Benefits: విటమిన్ కే1 చేస్తున్న మ్యాజిక్.. గుండెకు బాడీగార్డ్.. ఇది ఏ ఆహారంలో ఎక్కవగా లభిస్తుందో తెలుసా?
Vitamin K1 Benefits: గుండె జబ్బులకు ముఖ్య కారణాల్లో ఆర్టిరీలు గట్టి కావడం ఒకటి. విటమిన్ కె1, ఒక ముఖ్యమైన ప్రోటీన్ అయిన MGP ను సక్రియ పరచడంలో సహాయపడుతుంది.

Benefits of taking Vitamin K1 daily for the heart
ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా సడెన్ గా వస్తున్న ఈ హర్ ఎటాక్ లు చాలా మందిలో భయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించడం అవసరం. కొన్ని రకాల ప్రత్యేకమైన పోషకాలు లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి జాగ్రత్త పడవచ్చు. అలాంటి పోషకాలలో విటమిన్ కే1 ఒకటి. ఇది నిజంగా గుండెకు బాడీగార్డ్ లాంటిది అనే చెప్పాలి. కాబట్టి. ఈ విటమిన్ ఎక్కువగా ఏ ఆహారపదార్థాలలో లభిస్తుంది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
విటమిన్ కె1 అంటే ఏమిటి?
విటమిన్ కె రెండు ప్రధాన రూపాల్లో ఉంటుంది: విటమిన్ కె1 (Phylloquinone), విటమిన్ కె2 (Menaquinone) ఇది ప్రధానంగా ఆకుకూరల్లో, పాలు, మాంసంలో ఎక్కువగా లభిస్తుంది. దీని ముఖ్య పని రక్తం గడ్డకట్టడం (blood clotting) ను నియంత్రించడం కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది.
విటమిన్ కె1 వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు:
1.ఆర్టిరీలలో కాల్షియం జమ కాకుండా నివారిస్తుంది:
గుండె జబ్బులకు ముఖ్య కారణాల్లో ఆర్టిరీలు గట్టి కావడం ఒకటి. విటమిన్ కె1, ఒక ముఖ్యమైన ప్రోటీన్ అయిన MGP ను సక్రియ పరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రోటీన్ ఆర్టిరీల్లో కాల్షియం పేరుకోకుండా అడ్డుకుంటుంది.
2.రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది:
ఆర్టిరీలు మెత్తగా, సజీవంగా ఉండటం వలన రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. విటమిన్ కె1 ఆర్టిరీలలో కాల్షియం జమను నిరోధిస్తుంది. దీనివల్ల రక్తప్రవాహం మెరుగవుతుంది, హైపర్‌టెన్షన్ రిస్క్ తగ్గుతుంది, గుండె పని తేలికగా సాగుతుంది.
3.ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది:
విటమిన్ కె1 లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాల కణజాలాన్నీ రక్షిస్తుంది, హార్ట్ సెల్స్ లో ఉన్న డ్యామేజ్ ను తగ్గిస్తుంది, గుండెకు స్ట్రెయిన్ తగ్గి దీర్ఘకాలిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4.దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువ విటమిన్ కె1 తీసుకునే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కాల్షియం స్థాయిలు నియంత్రణలో ఉండటం వలన హార్ట్ వాల్వ్స్ దెబ్బతినే అవకాశాలు తగ్గుతాయి.
విటమిన్ కె1 లభించే ముఖ్యమైన ఆహారపదార్థాలు:
- ఆకుకూరలు (పాలకూర, గోంగూర, అరిటాకూర)
- బ్రోకలీ
- గ్రీన్ టీ
- బీన్స్, పులుసు కూరలు
- అవోకాడో
విటమిన్ కె1 అనేది కేవలం రక్తం గడ్డకట్టడంలోనే కాదు, గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆర్టిరీలు మృదువుగా ఉండటానికి, రక్తప్రవాహం సమంగా జరిగేందుకు, హై బిపి తగ్గించడానికి సహాయపడుతుంది.