Brain Health: మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది

మెదడు అనేది మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. మెదడు ఆదేశాలు(Brain Health) లేకుండా శరీరంలో ఏ ఒక్క పని కూడా జరుగదు.

Brain Health: మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది

Do these 5 things in the morning for brain health

Updated On : September 6, 2025 / 9:31 AM IST

Brain Health; మెదడు అనేది మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. మెదడు ఆదేశాలు లేకుండా శరీరంలో ఏ ఒక్క పని కూడా జరుగదు. మనం తీసుకునే నిర్ణయాలు, భావోద్వేగాలు, మనసిక స్థితి, జ్ఞాపకశక్తి ఇవన్నీ మెదడు ఆధీనంలోనే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యం అనేది చాలా అవసరం. అయితే, మెదడు ఆరోగ్యంగా ఉంచాలంటే కేవలం శరీరకంగానే కాదు, మానసికంగా కూడా మంచి అలవాట్లు అవసరం. అందుకే ప్రతిరోజూ(Brain Health) ఉదయం కొన్ని మంచి పనులను చేయడం వల్ల మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ పనులు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Hypertension: డేంజర్ బెల్స్.. పెరుగుతున్న హైపర్ టెన్షన్ భాదితులు.. ప్రమాదంలో యువత

1.ధ్యానం:
ప్రతీరోజు ఉదయం 10 నుంచి 15 నిమిషాల ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే, ఒత్తిడిని తగ్గించి మెదడులో సెరోటొనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల స్రావాన్ని సమతుల్యం చేస్తుంది. దీర్ఘకాలికంగా మెదడు ఏజింగ్‌ను ఆలస్యం చేస్తుంది.

2.చిన్న వ్యాయామం:
ఉదయం పూట 20 నుంచి 30 నిమిషాల నడక, యోగా, చిన్న వ్యాయామం చేయడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. ఇది మెదడు నైపుణ్యాలను మెరుగుపరచడంలో, ఆలోచనా శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే ఎండోర్ఫిన్లు విడుదలవడం వల్ల మెదడులో “హ్యాపీ హార్మోన్లు” విడుదల అవుతాయి.

3.మెదడుకు మంచి ఆహారం:
ఉదయం మెదడు నిద్ర నుంచి మేల్కొన్న సమయంలో దానికి శక్తి అవసరం. అందుకే న్యూట్రిషన్-రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఉదాహరణకు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఓట్స్, గుడ్లు, అవకాడో వంటివి తినాలి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్థాయి. ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి మెదడులో న్యూరాన్ కనెక్షన్లను బలపరుస్తాయి.

4.పుస్తక పఠనం:
ఉదయం పూట పుస్తకం చదవడం లేదా సుడోకు, క్రాస్‌వర్డ్ లాంటి పజిల్స్ వంటివి చేయడం వల్ల మన మెదడు శక్తి వంతంగా తయారవుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరచడంలో, అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

5.సహజ వెలుతురు, ప్రకృతి:
ఉదయాన్నే సూర్యకాంతిలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు గడపడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇది మెదడులో Vitamin D స్థాయిని పెంచుతుంది, డిప్రెషన్ నివారణకు సహాయపడుతుంది. ప్రకృతిలో గడపడం వల్ల మెదడు అలసట తగ్గుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది.