Hypertension: డేంజర్ బెల్స్.. పెరుగుతున్న హైపర్ టెన్షన్ భాదితులు.. ప్రమాదంలో యువత
ఈ మధ్యకాలంలో చాలా మందిల్లో ఎక్కువుగా పెరుగుతున్న సమస్య హైపర్ టెన్షన్(Hypertension). దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

What are the reasons for the increase in hypertension in young people?
Hypertension: ఈ మధ్యకాలంలో చాలా మందిల్లో ఎక్కువుగా పెరుగుతున్న సమస్య హైపర్ టెన్షన్. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మారుతున్న జీవన విధానం, ఒత్తిడి హైపర్ టెన్షన్ కు పెరగడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాలలో (Hypertension)ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. యువత ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ సమస్య గురించి తెలుసుకొని నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
KTR: మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్
హైపర్‌టెన్షన్ ప్రమాదం ఎందుకు:
హైపర్‌టెన్షన్ అనేది ప్రాణాపాయం అయ్యే ప్రమాదం ఎక్కువ. ఎక్కువ కాలం చికిత్స లేకుండా అలానే ఉంటే ఇది దిగువ సమస్యలకు దారి తీస్తుంది:
- హార్ట్ ఎటాక్
- పక్షవాతం
- కిడ్నీ ఫెయిల్యూర్
- దృష్టిలోపాలు
- గుండె విఫలమవడం
హైపర్‌టెన్షన్ పెరగడానికి ప్రధాన కారణాలు:
1.ఆహార అలవాట్లు:
ఆహారపు అలవాట్లు హైపర్ టెన్షన్ కు ప్రధాన కారణాలు కావచ్చు. అందులో అధిక ఉప్పు తినడం, ఎక్కువ నూనె, జంక్ ఫుడ్, తక్కువ పొటాషియం, ఫైబర్ ఉన్న ఆహరం తీసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.
2.నిద్రలేమి, మానసిక ఒత్తిడి:
ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. స్ట్రెస్, శారీరక శ్రమలేమి, అసమయ భోజనం వీటివల్ల కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
3.ఆల్కహాల్, ధూమపానం:
ఆల్కహాల్, ధూమపానం ఈ రెండిటిలో ఉండే నికోటిన్ వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల కూడా హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
4.శారీరక చురుకుదనం లేకపోవడం:
ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకే దగ్గర కూర్చొని చేసే [పనులు చేస్తున్నారు. దీనివల్ల శరీరం కదలకుండా ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు. అలాగే, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.
5.జెనెటిక్ కారకాలు:
హైపర్ టెన్షన్ కొన్ని సందర్భాలలో జెనెటిక్ లక్షణాల వల్ల కూడా రావచ్చు. కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉంటే తమ సంతానానికి కూడా వచ్చే అవకాశం ఉంది.
నివారణ చర్యలు:
- ఉప్పును రోజూ 5 గ్రాముల లోపే తినడం మంచిది.
- అధిక ఫైబర్, తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి
- రోజుకు కనీసం 30 నిమిషాలు నడక / యోగా / జిమ్ చేయాలి.
- స్ట్రెస్ కంట్రోల్‌కు ప్రాణాయామం, ధ్యానం అవసరం
- రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం
- స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి
- BMI ను సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి
- సెల్ఫ్ మెడికేషన్ చేయకండి
- ప్రతి 3 నెలలకు ఒకసారి B.P. పరీక్ష చేయించుకోవాలి.