Ram Charan : ఈసారి నేషనల్ అవార్డు పక్కా.. చరణ్ – సుకుమార్ దానికి సీక్వెల్ ప్లాన్ చేశారట..

తాజాగా టాలీవుడ్ లో చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

Ram Charan : ఈసారి నేషనల్ అవార్డు పక్కా.. చరణ్ – సుకుమార్ దానికి సీక్వెల్ ప్లాన్ చేశారట..

Ram Charan

Updated On : August 14, 2025 / 9:11 PM IST

Ram Charan : రామ్ చరణ్ కెరీర్లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా నటన పరంగా అందరూ మెచ్చుకున్నా సినిమా మాత్రం రంగస్థలం. ఈ సినిమాకు రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. రంగస్థలం పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రీజనల్ రికార్డులను బద్దలు కొట్టింది. రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ చేయాల్సింది అని ఇప్పటికి ఫ్యాన్స్ బాధపడతారు.

అయితే తాజాగా టాలీవుడ్ లో చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో అని తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా అవ్వగానే సుకుమార్ మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం సుకుమార్ చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.

Also Read : Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..

గతంలో చరణ్ RRR సినిమా చేసేటప్పుడు ఆ సినిమా లుక్ లో చరణ్ తో సుకుమార్ ఓ ఫైట్ సీన్ కంపోజ్ చేసి పెట్టుకున్నాడు. ఆ ఫైట్ లేదా ఆ లుక్ తో కథ రాసుకుందామని. అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ కి రంగస్థలం 2 ఆలోచన వచ్చిందట. ఇప్పటికే తన శిష్య బృందంతో కలిసి రంగస్థలం 2 సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే చరణ్ కి ఈ కథ బేసిక్ ఐడియా వినిపిస్తారట.

దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే సుకుమార్ – రామ చరణ్ కలిసి రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేస్తే ఈ సారి పాన్ ఇండియా వైడ్ మాస్ హిట్ అవ్వడమే కాక, చరణ్ పక్కా నేషనల్ అవార్డు వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా గురించి సుకుమార్, చరణ్ ఎవరో ఒకరి దగ్గర్నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.

Also Read: Tollywood Anchors : టాలీవుడ్ యాంకర్స్ లో సిండికేట్ జరుగుతుందా? మొన్న ఉదయభాను, ఇవాళ సౌమ్య కామెంట్స్ వైరల్..