Musi River Floods: హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం.. ఇళ్లలోకి చేరిన నీరు.. ఖాళీ చేయిస్తున్న అధికారులు..
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది.

Musi River Floods: హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో 11 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 12వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో చాదర్ ఘాట్, శంకర్ నగర్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లోని ఇళ్లలోకి మూసీ నీరు చేరింది. దీంతో అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ కు 2500 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ కు 14000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మొత్తం 11 గేట్లు ఓపెన్ చేసి 14,718 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వదులుతున్నారు హైదరాబాద్ జలమండలి అధికారులు.
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది. చాదర్ ఘాట్, గోషామహల్ సర్కిల్, ముస్లిం జంగ్ బ్రిడ్జి కింద ఉన్న వారిని పక్కనే ఉన్న పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. 10 గేట్లు ఓపెన్ చేసి 13వేల 400 క్యూసెక్కుల వరద నీరును మూసీలోకి వదులుతున్నారు.
Also Read: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 33మంది భక్తులు మృతి.. ఆలయానికి వెళ్లే సమయంలో ఘోరం