Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!

అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్ఘానిస్తాన్ లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు.

Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!

Afghan

Taliban అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్ఘానిస్తాన్ లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు. రాజధాని కాబూల్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని..దేశ అధ్యక్షుడు అప్ఘానిస్తాన్ వదిలి పారియేలా చేశారు. చివరికి అఫ్గానిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల కంట్రోల్ లో ఉంది. మరికొద్ది గంటల్లో అప్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. తాలిబాన్ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్..అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే ఆవకాశం ఉంది. అయితే అప్ఘానిస్తాన్ లో ఈ దఫా తాలిబన్ ప్రభుత్వంలో..ముల్లా బరాదర్ సహా నలుగురు వ్యక్తలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్

53 ఏళ్ల ముల్లా బారదార్‌… అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నగరంలో పెరిగారు. ఈ ప్రాంతంలోనే తాలిబన్ల ఉద్యమం పురుడు పోసుకుంది. 1970 ల చివర్లో అప్ఘానిస్తాన్ లో సోవియట్ దండయాత్ర ద్వారా క్లిష్టమైన జీవితాన్ని గడిపిన బరదార్ తిరుగుబాటుదారుడిగా ఎదిగాడు.  1980 వ దశకంలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక కన్ను కలిగిన తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌తో కలిసి బరాదర్ పోరాడాడని చెప్పుకుంటారు.

1990 లలో సోవియట్ యూనియన్ ఈ ప్రాంతం నుండి వైదొలగడంతో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య ముల్లా ఒమర్ తో కలిసి తాలిబాన్ సంస్థ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించాడు. 1994లో తాలిబాన్ల ఏర్పాటు తర్వాత బరాదర్ ఒక కమాండర్‌గా, వ్యూహకర్తగా కీలక పాత్రలు పోషించారు. ముల్లా ఒమర్ సజీవంగా ఉన్న సమయంలోనే ఆయన తాలిబాన్ల నిధుల సేకరణ, రోజువారీ కార్యకలాపాలకు బాధ్యులుగా ఉన్నారు. తాలిబాన్ల ఖర్చుల చిట్టా మొత్తం ఆయనే చూసుకుంటారు.

2001లో అమెరికా నేతృత్వంలో అఫ్గానిస్తాన్ మీద దాడులు జరిగి, తాలిబాన్లు అధికారం కోల్పోయినపుడు నాటో బలగాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు. తాలిబాన్లు అధికారం కోల్పోయిన సమయంలో తాలిబాన్ల ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ ఉప మంత్రిగా ఉన్నారు. ఇక, ఆ సమయంలో ఉగ్రవాదులకు కొత్త నాయకత్వాన్ని అందించాలని.. అప్పటి తాలిబాన్ తాత్కాలిక నాయకుడు హమీద్ కర్జాయ్ పై సాగిన ఒక చిన్న తిరుగుబాటు దారులలో బరదార్ ఉన్నాడని అంటారు.

2010 లో పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో ముల్లా బరదార్‌ను పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచే పాక్‌ జైలులోనే ఉన్న ముల్లా బరదార్. 2018లో శాంతి చర్చలను ప్రోత్సహించడానికి అప్పటి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కొంతమంది బందీల విడుదలకు సంబంధించి ఒక జాబితాను ప్రచురించింది. వారిలో బరాదర్ పేరు కూడా ఉంది. 2018 అక్టోబర్‌ 24న బరాదర్ ని అమెరికా విజ్ణప్తి మేరకు జైలు నుంచి విడుదల చేసింది పాకిస్తాన్.

పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఖతార్‌కు వెళ్లిన ముల్లా బరాదర్.. అక్కడే తాలిబన్ల రాజకీయ పార్టీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి దోహాలో అమెరికన్లతో కీలక చర్చలను ఆయనే పర్యవేక్షించారు. అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను పూర్తిగా తొలగించాలని కోరుతూ అమెరికా ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని కూడా ఆయన పర్యవేక్షించారు.

ముల్లా యాకూబ్
తాలిబన్ సంస్థ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ తనయుడే ముల్లా యాకూబ్‌. అప్ఘాన్ లోని సంస్థ మిలిటరీ కమిషన్ల విభాగాలన్నింటికీ ఇతడే అధిపతి. భవిష్యత్తులో అప్ఘానిస్తాన్ కి ఇతనే సారథ్యం వహించవచ్చని నిఘావర్గాలు భావిస్తున్నాయి.

హైబతుల్లా అఖుంజాదా
తాలిబన్ గ్రూప్ సుప్రీం లీడర్. మతపర వ్యవహరాలకు అధిపతిగా ఉన్నారు. విశ్వాసం గల వ్యక్తి అని ఇతనికి పేరుంది. 1980వ దశకంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ చేసిన తిరుగుబాటులో హైబతుల్లా కమాండర్ పాత్ర పోషించారు. కానీ ఆయనకు సైనిక కమాండర్ కంటే ఎక్కువగా ఇస్లాం పండితుడుగానే గుర్తింపు ఉంది. దోషులుగా తేలిన హంతకులకు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారికి మరణదండన, దొంగతనం చేసేవారికి చేతులు నరకాలని ఆదేశాలు జారీ చేశారు. తాలిబాన్ల మాజీ చీఫ్ అఖ్తర్ మొహమ్మద్ మన్సూర్‌కు హీబాతుల్లా డిప్యూటీగా కూడా ఉన్నారు. 2016లో జరిగిన అమెరికా డ్రోన్ దాడుల్లో మన్సూర్ చనిపోయారు. ఆయన తన వీలునామాలో హీబాతుల్లాను తన వారసుడుగా ప్రకటించారు. అయితే, ఆయన ఎంపిక ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని తాలిబాన్లు చెప్పారు. దాదాపు 60 ఏళ్ల వయసున్న హైబతుల్లా తన జీవితంలో ఎక్కువ భాగం అఫ్గానిస్తాన్‌లోనే గడిపారు. క్వెట్టాలోని తాలిబాన్ల షురాతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

సిరాజుద్దీన్ హక్కానీ
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే హక్కానీ నెట్‌వర్క్​కి ఇతడే నాయకుడు.తాలిబన్ డిప్యూటీ లీడర్‌గానూ, అమెరికన్లపై దాడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఉగ్రవాది సంస్థ హక్కానీ నెట్‌వర్క్​కి అధిపతిగా ఉన్నారు. కొన్నేళ్లుగా కాబుల్‌లోని తీవ్రమైన దాడులన్నీ ఈ సంస్థ సారథ్యంలో జరిగినవే. సోవియట్‌ వ్యతిరేక ముజాహిదీన్‌ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్‌ హక్కానీ.

READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!